స్వరాలాపన-26

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: కల్యాణి రాగం 

Arohanam:S R2 G3 M2 P D2 N3 S
Avarohanam: S N3 D2 P M2 G3 R2 S

చిత్రం: ఏకవీర (1969)

గీతం: తోటలో నా రాజు

సంగీతం: కె.వి. మహదేవన్

గీత రచన: సినారె

నేపథ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు

సాససాగా పపపాప మాపమాగరిమామ  

మాదమా గమగారి రిమగ రీసస రీగ 

మాదమా గమగారి రిమగ సాసస రీగ 

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు

సాససాగా పపపాప మాపమాగరిమామ  

నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

మాదమా గమగారి రిమగ రీసస రీగ

చరణం 1:

నవ్వులా అవి.. కావు

పనిదపా మదమనిద

న..  వ్వులా అవి కావు… నవ పారిజాతాలు

ప.. పనిదపా మదమనిద మదదసని దనిపాప

నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు

రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు

గాసాని దనిమాగ రిరిమపప రిగసాస  

రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు

గాసాని దనిమాగ రిరిమపప రిగసాస  

ఆ రాజు ఈ రోజు అరుదెంచునా

సాసా*స*స*గ*సా*స* దనిమాదనీ  

ఆ రాజు ఈ రోజు అరుదెంచునా

అపరంజి కలలన్నీ చిగురించునా ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… 

నిసనీద దనిదాప  మనిదాప     మప మగ గరి రిస

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు

సాససాగా పపపాప మాపమాగరిమామ  

నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

మాదమా గమగారి రిమగ రీసస రీగ 

చరణం 2:

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను

సాససాగా పపపాప మాపమా గామామ  

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను

సాససాగా పపపాప మాపమా గామామ  

పాటలాధర రాగ భావనలు కన్నాను

మాదమా గరిమామ రిమగరిస రీగాగ 

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను

సాససాగా పపపాప మాపమా గామామ  

పాటలాధర రాగ భావనలు కన్నాను

మాదమా గరిమామ రిమగరిస రీగాగ 

ఎలనాగ నయనాల కమలాలలో దాగి

దనిమాప దనిమాప మదదనిస దనిపాప

ఎలనాగ నయనాల కమలాలలో దాగి

పనిమాప దనిమాప మదదనిస దనిపాప

ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను

గగసాని దనిపా గారిరిమపప రిగసాస  

ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను

గగసాని దనిపా గారిరిమపప రిగసాస  

ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ

సాసా*స* స*గ*సా* సా*దనిమాదనీ  

ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ

సాసా*స* స*గ*సా* సా*దనిమాదనీ  

అనురాగ మధుధార యై సాగనీ

నిసనీద దనిదాప  పా   పా మప మగ గరి రిస

ఊఁహూఁహుఁ.. ఊఁహూఁహుఁ.. 

సాససాగా పపపాప మాపమాగరిమామ  

ఉఁహుఁహుఁ…. ఊఁహూఁహుఁ..

మాదమా గమగారి రిమగ రీసస రీగ 

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు

సాససాగా పపపాప మాపమాగరిమామ  

నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు… ఉ .. ఉ .. 

మాదమా గమగారి రిమగ రీసస రీగా రీసా  

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో మూడవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.