శోభరమేష్ పాపయ్యపేట, మండలం చిన్నారావుపేట, వరంగల్ జిల్లా వాస్తవ్యులు. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు, ఎం. ఏ., పి. హెచ్ డి., ఎం. ఏ. సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012) పై పరిశోధన చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
రచనలు :
'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాససంపుటి) - 2015
'వ్యాస శోభిత' (వ్యాససంపుటి) - 2015
'స్త్రీల కృషి' (తెలుగు సాహిత్యవిమర్శ) - 2018
జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!! -శోభరమేష్ అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు వీస్తున్న కాలం ! లాటిన్ అమెరికా జాతీయోద్యమాల అగ్ని పర్వతాలు వెదజల్లే లావావేడి గాలులు..! హిమగిరులను మరిగిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న ఝంఝూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్మోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం ఉష్ణరక్త కాసారపు భుగ భుగలు పీడితప్రజల రక్తనాళాలను ఉరుకలు వేయించుతున్న కాలం ఘనీభవించిన ఓల్గాను త్రోసి రాజంటూ […]