https://youtu.be/KEJ4WkRFMec ఓ కథ విందాం! సేద్యం ధీర భోజ్యం రచన & పఠనం – లలిత గోటేటి మెరుస్తున్న కళ్ళు నావైపే చూస్తున్నాయి. నిజానికి క్లాసులో ఉన్న యాభైమంది విద్యార్ధులు నేను చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు . కానీ అందరిలోకీ ప్రత్యేకంగా ఆ రెండు కళ్ళలో ఏదో మెరుపు ,గొప్ప జిజ్ఞాస, జీవనోత్సాహం నాకు తెలుస్తోంది. మరుక్షణమే నా మనసు పాఠం చెప్పే ఏకాగ్రతలోకి జారిపోయింది. విలియం వర్డ్స్ వర్త్ అద్భుత రచన ‘డేఫ్ఫోడిల్స్’ పద్యంలోని […]
దీక్ష (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -లలిత గోటేటి సమయం సాయంత్రం నాలుగు గంటలు అయింది. అనుకున్నట్టుగానే డ్రైవర్ రాజు వచ్చేశాడు. నేను విజయనగరం వచ్చి ఇరవైనాలుగు గంటలు గడిచింది.నిన్న రాత్రి జరిగిన నా కజిన్ కూతురు పెళ్లి కి వచ్చాను. నిజానికి పెళ్లి కంటే శాంతిని చూడాలన్నదే నా కోరిక. విజయనగరంలో పెళ్లి అనగానే నా మనసు ఎగిరి గంతేసింది. జీవితం ఎంత పొడుగ్గా సాగి నా, […]
ఎరుక -లలిత గోటేటి మార్గశిరమాసం సాయంత్రం ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్ కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న మనుషులు అక్కడక్కడ కనబడుతున్నారు. తాను ఎక్కడికి వెళుతోంది తనకే తెలియదు అనుకున్నాడు శ్రీధర్. కారును ఓ పక్కగా ఆపి,డోర్ లాక్ చేసి,చుట్టూ పరికిస్తూ నిలబడ్డాడు. చేను గట్టునున్న కాలిబాట మీద నడుస్తూ ముందుకు వెళ్ళాడు. […]