షర్మిలాం“తరంగం”-30
షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి -షర్మిల ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్ వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్. నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే తన దగ్గరే ఎక్కువ వుండేది. కరోనాతో వున్న అన్నయ్యని ఆసుపత్రికి తిప్పి అతనితో పాటు కరోనా బారినపడి కన్నుమూసాడు. వృద్ధులైన తల్లితండ్రులు నడివయసులో వున్న ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని బతుకీడుస్తున్నారు. నా మరదలు నా తమ్ముడి ఇంటి దీపం వాడిని పిల్లల్ని అనాధల్ని చేసి వెళ్ళిపోయింది. వరసకి వదినని అయినా “అక్కా” అని అరుణ పిలిచే పిలుపు ఇంకా చెవులకి వినిపిస్తూనే వుంది. మా తోటికోడలి తమ్ముడు నన్నూ ఎంతో ప్రేమగా “అక్కా! ఇంటికి ఓసారిరండి ” అని […]
Continue Reading
































































