ఓల్గా- ఓ బలమైన స్త్రీవాద స్వరం!!

(ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం)

-ఎ.రజాహుస్సేన్

(తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా ఓల్గా గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూంది!)

*తెలుగు నాట ఓల్గా ఒక ‘ ద్వంద్వ సమాసం.’ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు
లాంటి పదాలను ఎలా విడదీయలేమో, స్త్రీవాదం ఓల్గా అనే పదాలని కూడా మనం విడదీయలేం. రెండు ఆత్మలు కలగలసిన ఏక జంటపదం ఓల్గా! రచన, ఆచరణ… ఈ రెండు ఆత్మలు’.(వంశీకృష్ణ)

*కవిత్వంతో సాహిత్య ప్రస్ధానం మొదలు…వచనంతో స్థిరత్వం…!!

పైగంబర కవిత్వం నుంచి వచనానికి
మళ్ళిన “ ఓల్గా.!!

అయిదుగురు పైగంబర కవులలో ఓల్గా ఒకరు
1950 లో గుంటూరు జిల్లాలో, యడ్లపాడు గ్రామంలో పుట్టారు.ఓల్గాఅసలు పేరు పోపూరి
లలిత కుమారి గుంటూరు ఏసి కళాశాలలో చదువుకున్నారు.కవయిత్రిగా మొదలైన సాహి
త్య ప్రస్తానం వచన రచనకు మళ్ళింది.నవల,
కథ,అనువాదాలు,సంపాధకత్వాలు,సాహిత్య విమర్శనాటిక,నృత్య రూపకం,వ్యాసాలు,.ఇలా
ఓల్గా వచన రచనలుబహుముఖీనంగా విస్తరించా
యి.అయితే ఓల్గా సుదీర్ఘ సాహిత్య ప్రయాణానికి తొలిఅడుగు మాత్రం కవిత్వమే.స్త్రీవాదిగా మారిం
ది కూడా కవిత్వంతోనే. ( పంచాది నిర్మల వారసు
రాలిని…1972)

పైగంబర కవిత్వానికి (1970..71 ) ముందే ఒకటీ అరా..కవితలు రాసిప‌నా… కవిత్వ లోకంలో ‘ఓల్గా‘ గుర్తింపు పొందింది మాత్రం పైగంబర కవిగానే.అయి
దుగురు (సుగమ్ బాబు, దేవిప్రియ ,కమలాకాంత్, కిరణ్ కుమార్. ఓల్గా) పైగంబర కవుల్లో ఆమె ఒకరు.

పైగంబర కవిత్వం రెండు సంపుటాలుగా వచ్చింది.
ఈ రెండు సంపుటాల్లోకలిపి ఓల్గా మొత్తం ఎనిమిది
కవితలు రాశారు.

“ప్రస్తుతం పతనమైన సమాజం నుండి స్వర్గం ఉద్భవిస్తుందనీ,ఉద్భవించాలనీ ఆశగా ఆవేశంగా
ఎదురు పలికే కవిత్వం ఓల్గాది.(రాజారామ్)

పైగంబర కవిత్వం తర్వాత ఎందుకనో ఓల్గా కవిత్వా
నికి ఎడంగా జరుగుతూ వచ్చారు.ఆతర్వాత అడపా
దడపా కవిత్వం రాశారు కానీ, దానిపై సీరియస్ గా దృష్టి. పెట్టలేదనే. చెప్పాలి.

మొత్తానికి 1972 నుండి అప్పుడప్పుడు రాసిన కవితల్ని ఏర్చి కూర్చి 2011జూలై నెలలో “ ఓల్గా కొన్ని కవితలు “ పేరిట ఓ సపుటి తెచ్చారు.దీన్ని డా.సి.నారాయణరెడ్డి గారికి అంకితమిచ్చారు.
డా.గోపి గారు దీనికి. ముందుమాట రాశారు. పైగంబర కవిత్వంతర్వాత ఓల్గా నుంచి వచ్చిన ఏకైక కవిత్వ సంపుటి ఇదే.

1972 లో ఓల్గా రాసిన “పంచాది నిర్మల వారసు
రాలిని “..అన్నకవితతో స్త్రీల గురించి రాయడం
మొదలు పెట్టారు.ఆ తర్వాత ఓల్గా సాహిత్య ప్రస్థా
నం వచనం వైపుకుమళ్ళింది.కథ,నవల,విమర్శ..
ఇలా.బహు ముఖీనంగా విస్తరించింది.

క్రమంగా “స్త్రీవాద రచయిత్రిగా ఆమె నిలదొక్కుకు
న్నారు.1993లో ఆమె సంపాదకత్వంలో …
“నీలి మేఘాలు” కవితా సంకలనం వచ్చింది. స్త్రీ
వాదసాహిత్యంలో ఇదొక ” Applied Manifesto”
లాంటిది.ఇందులో కవితల ఎంపికతో పాటు, ఓల్గా
రాసిన పీఠిక స్త్రీవాదానికి చూపుడు వేలైందనడంలో
ఎటువంటి సందేహం లేదు.

డా. గోపి గారన్నట్లు “ ఓల్గా బలమైన స్త్రీవాద రచ
యిత్రి.అనీ, ఉద్యమ నేత్రి అనీ” కొత్తగా చెప్పనక్కర
లేదు.సుమారు అయిదు దశాబ్దాలుగా ప్రతి క్షణం
ఆమె స్త్రీల పక్షం వహించి చైతన్య వంతమైన రచ
నలు చేశారు.స్త్రీ సాధికారత కోసం పురుష ప్రపం
చానికి ఎదురునిలిచి పోరాడారు.” ఆమె ఒక యాక్టివిస్టు మాత్రమే కాదు.గొప్ప సృజన కారిణి కూడా “ అన్న గోపీగారి మాటల్లో ఎంతో నిజముంది.

ఓల్గా ..సాహిత్యం .!!

*నవలలు.!!

సహజ,స్వేఛ్ఛ,మానవి,కన్నీటి కెరటాల వెన్నెల,ఆకాశంలో సగం,గులాబీలు .

*కథాసంకలనాలు

రాజకీయ కథలు,ప్రయోగం,భిన్న సందర్భాలు,మృణ్మయనాదం.
విముక్త..(కథాసంపుటి)

*అనువాదాలు

సామాన్యుల సాహసం,భూమి పుత్రిక, మిస్సింగ్,మూడుతరాలు,పుట్టని బిడ్డకు
తల్లి వుత్తరం, ఉరికొయ్య అంచున, నేనూ సావిత్రిబాయిని,అక్షర యుద్ధాలు.

*సంపాదకత్వం…!!

మాకు గోడలు లేవు,నీలిమేఘాలు,నూరేళ్ళ చలం,సారాంశం,సరిహద్దులు సంధ్యలు, మహిళావరణం,జీవితమే ఒక ప్రయోగం,
అలజడి మా జీవితం,నవలా మాలతీయం!

*ఇతర రచనలు…‌

అతడు..ఆమె..మనం (సాహిత్య విమర్శ ) కుటుంబ వ్యవస్థ, మార్క్సిజం(వ్యాసం ) వాళ్ళు ఆరుగురు (నాటిక ), యుద్ధము..శాంతి (నృత్య రూపకం) పలికించకు మౌన మృదంగాలను (సాహిత్య వ్యాసాలు ),తొలి వెలుగులు
(స్త్రీవాద వ్యాసాలు ), కుటుంబ వ్యవస్థ,..! మార్క్సిజం,…ఫెమినిజం‌ (స్త్రీ వాద( వ్యాసాలు ),
సహిత (సాహిత్య వ్యాసాలు )

*అవార్డులు..రివార్డులు…!!

రచయిత్రిగా ఓల్గాకు ఎన్నో అవార్డులొచ్చాయి.
అందులో “లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (నగదు పురస్కారం 25లక్షల రూపాయలు )
విముక్త. కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ముఖ్యమైనవి.ఇంకా ఇతర అవార్డులు చాలానే. వున్నాయి.అన్నింటికంటే ముఖ్యంగా పాఠకులనుంచి వచ్చిన రివార్డులు,అన్నీ యిన్నీ
కావు!!!

పైగంబర కవిగా..!!

మొదటి సంపుటి “యుగసంగీతం “ లో ఓల్గా
నాల్గు కవితలు రాశారు.అవి‌…

1.సత్యం కావాలి
2ఆరోజు
3పునర్జన్మ

4.యుగధర్మం .

ఈ నాలుగు కవితల్లో కూడా మనిషే అజెండా.
అలాగే మనిషి మేల్కోవాలి,సమాజం బాగుండా
లన్న ‘ పైగంబర తత్వం ‘ …ఓల్గా కవిత్వంలో కనిపిస్తుంది.

1సత్యం కావాలి…!

“ఉదయిస్తున్న సూర్యబింబంలా
వెలిగిపోయే నిజాన్ని వదిలి
రాహుబంధంలో చిక్కుపడి
వెలవెలబోతున్న చందమామ వంటి
అబద్ధాన్ని ఎందుకు గీస్తున్నావు?
మానవతా కాసారంలో మరులుతీరా
విహరించే అందాల రాయంచవు
ఈ పాపాల తీరాలలోకి ..ఈ మురికి
కూపాలలోకి ఎందుకు పరిగెడుతున్నావు?
***
నీకూ నీ చుట్టూవారికీ
శాంతి సుధలు కాంతి కథలు
పంచి ఇవ్వాల్సిన వాడివి
యుద్ధ యజ్ఞాలలో కమ్మిన పొగకు
వచ్చిన కన్నీళ్ళు కమ్మగా ఉన్నాయని
సంతృప్తి పడిపోతున్నావేమిటి?

ప్రపంచం మరో యుద్ధవాతావరణానికి సన్నద్ధమవుతున్న సందర్భాన్ని ఈ కవితలో
అన్యాపదేశంగా ప్రస్తావించారు ఓల్గా.
రెండోయుద్ధ దుష్ఫలితాల నేపథ్యంలో మనిషి
యుద్ధోన్మాదం ఎంత దుర్మార్గమైనదో కవి
ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు.మానవ
త్వాన్నిపదిమందికీ పంచాలన్న సత్యాన్ని
మరిచి వ్యవహరిస్తోన్న మనిషికి హెచ్చరిక
ఈ కవిత.అందుకే….

*ఆరోజు…..!!

యుద్ధ భయానికి సంబంధించిన కవిత ఇది.

“ఏం వ్రాయను ?

రెండో ప్రపంచయుద్ధం లో అమెరికా జపాన్ హిరోషిమా,నాగసాకి పై వేసిన బాంబులు
ఎంత నాశనాన్ని కళ్ళ చూసాయో అందరికీ
తెలిసిన విషయమే.మళ్ళీ మూడో ప్రపంచ
యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో యుద్ధం వల్ల జరిగేనష్టాన్ని,
కష్టాన్ని,అరిష్టాన్ని కవి మన ముందుంచుతున్నారు.యుద్ధంవల్ల ప్రపంచ
మంతా ఎడారి కాబోతోందన్న కవి ఆందోళన ,
వేదన ఇందులో వుంది.ప్రపంచం అశాంతితో,
యఅగ్నిగోళంలా వుంటే ఏ కవైనా ఏం రాస్తారు?
ఖఎలా రాయగలుగుతారు.

“నాకు వ్రాయాలని వుంది
ఈ ప్రపంచం పద్మంలా వికసిస్తున్నదని
శాంతి కపోతంలా ఎగురుతున్నదని
ధర్మజ్యోతిలా వెలుగుతున్నదని
కానీ, ఈరోజు అలా వ్రాసేందుకు నోచుకోలేదు
అలా రాసే రోజు వస్తుంది
ఎంత సుదూరంలో అయినా సరే
ఆ వేకువ ఉదయిస్తుంది.”!!

కవి వాక్కు ఫలించాలి.లోకం శాంతి
సౌఖ్యాలతో తులతూగాలి.

పునర్జన్మ……!!

ఈ కవిత మనిషి కేంద్రంగా పురుడుపోసుకుంది.
నిజానికి అసలు మనిషనే వాడు. చచ్చిపోయాడు
ఇప్పుడున్నది బానిస మాత్రమే!చచ్చిన శవం కన్నా చైతన్య రహితంగా తయారయ్యాడు మనిషి.
అందుకే మనిషి మళ్ళీ పుట్టాలి.గుండె తలుపు తట్టాలి.చైతన్య దీపం పెట్టాలి శాంతికి కంకణం
కట్టుకోవాలన్నది కవి ఆశ.

“నువు బానిసవని మరిచి..నీకు బానిసల్ని కొనుక్కున మంచితనం గోడలో మర్రి ఊడలు మొలిపించిబ్రతుకుతున్న మనిషీ..నువ్వు బానిసవే
***
సింధువుల సైతం యిముడ్చుకోగల
నీ హృదయం రోజు రోజుకూ
కిటికీలు లేని గది అయిపోతోంది
మంచులో సైతం మంటలా మండిన నీ  గుండె
చచ్చిన శవంకన్నా చైతన్య రహితంగా వుంది
***

నీవు పుచ్చిపోయావు..కాదు కాదు చచ్చిపోయావు
మళ్ళీ నీవు పుట్టాలి..!గుండె తలుపు తట్టాలి “!!

మాయమైపోతున్న మనిషిని బతికించాలన్న
ఆశ కవిది.

యుగధర్మం….!!

ఇది మనిషి స్వభావానికి,ప్రవర్తనకు, వ్యవహార
శైలికి సంబంధించిన కవిత. మనిషి బాగుండాలన్న ‘పైగంబర తత్వాన్ని ‘ రాసిగా పోసిన కవిత.

“అన్యాయం విజృంభించినపుడు
న్యాయం భయపడి పారిపోయినపుడు
అధర్మం అందలం ఎక్కినపుడు
ధర్మం దుమ్ములో కలిసినపుడు
మౌనంగా కూర్చోవడం మానవత్వం కాదు
కోట్లకొలది ప్రజలు రాక్షస పాదాల
క్రింద నిర్దాక్షిణ్యంగా నలపబడుతుంటే
ఆ రాక్షసిని చంపటం హింస
అనడానికి నోరెలా వచ్చింది నేస్తం ? “
రామాయణంలో రాముడేం చేశాడు. తాటకిని చంపాడు. అది తప్పుకాదుగా?
అది తప్పుకానప్పుడు మనలో మెలిగే రాక్షసత్వాన్ని చంపడం తప్పెలా అవుతుంది.?
అన్నది ఓల్గా ప్రశ్న?

గీత కారుడేమన్నాడు.సత్యం కోసం,ధర్మం కోసం హింస తప్పు కాదన్నాడు.
ధర్మాన్ని రక్షించడానికి కృష్ణుడు కురుక్షేత్ర యుధ్ధం జరిపించలేదా? ఇదీ అంతే.!

*పైగంబర కవిత్వం మలి సంపుటి
“ యుగ చైతన్యం “ లో ‘ …….
ఎర్ర నిజం ‘ చెప్పిన ఓల్గా….!!

పైగంబర కవిత్వం తొలిసంపుటి “యుగ సంగీతం “ లో సాత్వికంగా కనిపించిన ఓల్గా మలి సంపుటి
“యుగ చైతన్యం “ లో ‘తిరుగుబాటు ‘ ధోరణిని ప్రదర్శించారు.
,
పైగంబర కవిత్వం రెండో సంపుటిలో
ఓల్గా రాసిన కవితలు….

1.ఎర్రనిజం.
2.యువతరం మేల్కొంది
3.పదముందుకు
4.నీవు చావలేదు

1.ఎర్రనిజం….!!

“విముక్తి కోరే ప్రతివాడికీ
వెయ్యండి సంకెళ్ళు
‌రాత్రి లేదు పగలు లేదు
బస్టాండ్ లో కాఫీ హోటల్లో
ఎక్కడపడితే అక్కడ
వెయ్యండి సంకెళ్ళు
న్యాయం కోసం ధర్మం కోసం
పోరాడేవారికి యింతకన్న
ఘన సత్కారం ఏమిటి?
ఊ…వెయ్యండి సంకెళ్ళు
సంకెళ్ళకు లొంగలేదా?
అతి చులాగ్గా తెంచారా?
ఏమిటా శక్తి?
ఇక లాభం లేదు
కాల్చిపారెయ్యండి..!”

సాహిత్యం ఎప్పుడూ సమకాలీనమే.1970నాటి సామాజిక పరిస్థితులకు ఈ కవిత అద్దంపడుతుంది.

ఈ కవిత.హక్కుల కోసం నోరు తెరిచినవాడికి సంకెళ్ళు,స్వేఛ్ఛ కోసం నోరు తెరిస్తే ఉరితాళ్ళు
రాజ్యం దుర్మార్గాలకు ఎదురొడ్డి ఈ మాత్రం నోరు విప్పిన పైగంబరుల గురించి ఎంత చెప్పినా
తక్కువే.హక్కుల సాధనలో ఒకడుచచ్చినా పదిమందికీ ప్రేరణ కాగలిగితే ఆ జన్మకు అంతకన్నా
కావలసిందేముంది ? అంటారు కవి.చివరకు విప్లవం జయిస్తుంది.నిప్పులాంటి “ ఎర్రనిజం “
అజేయంగా వెలుగుతుందన్నది కవి ఆశ.

*2.యువతరం మేల్కొంది…!!!

“గమ్యం లేని మార్గంలో
ధ్యేయం లేక బ్రతుకుతూ
మీరు చెప్పే నీతులకు నియమాలకు
ఇంతకాలం తలవంచిన
యువతరం మేలుకుంది
కల్లబొల్లి కబుర్లు చెబుతూ
వారిని వంచిస్తున్న కపటులారా!
ఇన్నాళ్ళు కన్నీరు నెత్తురై
వరదలై మిమ్మల్ని ముంచేస్తుంది
చేవచచ్చిన జీవం పుచ్చిన
మీ అహింసా పాఠాలు కర్మ వాదాలు
తెగనరకడానికి లేచింది యువత “..!!

తిరగబడిన యువతకు రాజ్యం సంకెళ్ళు వేస్తుంది.
ధర్మాన్ని పబ్లిగ్గా కాల్చే దుర్మార్గులకు కవి హెచ్చరిక…
”మేల్కొన్న యువతరం వారి గుండెల్లో నిద్రబోతుంది
ఆరోజు వస్తుంది.ఎర్రనిజం వెలుగులు పంచుతుంది.

3. పద ముందుకు…!!

ఇదీ మేలుకొలుపు కవితే.యుధ్ధం చేయడానికి మంది లేకున్నా ఒక్కడైనా సరిపోతాడు.
ఎవరో వస్తారని,తోడు నిలుస్తారని ఎదురు చూడకుండా మన ప్రత్నమేదో మనం చేయాలి.
అంటూ ఈ కవితలో యువత వెన్నుచరుస్తారు ఓల్గా.

“నీ జాతి నాశనానికి చూస్తూ
ఉవ్వెత్తున లేచే ఆ కెరటాలను చూడు
అవి ఆర్ప లేని  అగ్ని నీలో వుంది
ఆ చీకటిని చీల్చే వెలుగు నీలో వుంది
వెనక్కు అడుగు వెయ్యకు
నిన్ను ముంచుదామని ముందుకు వస్తాయి
తెగించి ముందుకు దూకు
బెదిరి వెనక్కు మళ్ళుతాయి.

ఇప్పటి వరకూ వ్యర్థమైన బ్రతుకులు చాలు
విప్లవాగ్నికి నీ జీవితం పణం పెట్టి
నీ జాతి జీవనాన్ని రక్షించుకో
ఆశయానికి తోడుగా ఆయుధం అందుకో. ”!!

ఇక చావు గురించి భయం దేనికి..జాతి కోసం తిరగబడితే పోయేదేం లేదు.బాధలు,బానిసత్వం తప్ప అందుకే ఈ భయంకర తమస్సముద్రంలో ఒంటరిగానైనా యుధ్ధం చేయాల్సిందే అంటారు
కవి ఓల్గా..!!

4.నీవు చావలేదు…!!

ఆదర్శం మరువనంత కాలం మనం మనుషులుగా వుంటాం.మరిచిన రోజున చచ్చిపోయిన
వాళ్ళతో సమానమవుతాం.ఆదర్శం కోసం ఎంత దూరమైనా పోవాలి.ఎన్ని యుధ్ధాలైనా
చేయాలి.సాటి మనుషుల్ని,తోటి మనుషుల్ని రాబందుల్లా పీక్కుతింటుంటే చూస్తూ వూరు
కోవడం భీరువు లక్షణం.ఎదిరించి పోరాడి సాటి మనిషికి సాయం చేయని నాడు మనం
ఊపిరున్న శవంతో సమానం.

ఆదర్శాల బాటలో పయనించే బాటసారికి
చేయూతనిచ్చేకవిత ఇది.

“నిజంగా నీవు చచ్చిపోయావే అనుకున్నాను
దున్నపోతుల కాళ్ళుకడిగి
సంపాదించిన నీ బిడ్డ సత్తెయ్య
చేతిలోని రొట్టె ముక్కను
మరో రాబందు పీక్కు తింటుంటే
నీవేమీ చేయలేక పోయినపుడు
నీవు చచ్చిపోయావనే అనుకున్నాను”

ఓల్గా కవిత్వం సామాజిక
చైతన్యానికిఓ ప్రబోధ గీతిక .

*ఓల్గా కవితలు కొన్ని…({2011)
.
సుమారు మూడున్నర దశాబ్దాలక దశాబ్దాల
కాలంలో ఓల్గా అప్పుడప్పుడు రాసిన
87 కవితలు ఈ కవితాసంపుటిలో వున్నాయి

ఇందులోని తొలికవిత..”పంచాది నిర్మల వారసు
రాలిని..ఓల్గాను స్త్రీ వాదంవైపు నడిపించింది.

“కానీ…రేపు
నేను పతివ్రతామ తల్లిని కాను
ప్రబంధ కన్యనుకాను
పంచదార చిలకను కాను
ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాను
పసిపాపల చంపే పాపిని కాను
పంచాది నిర్మల వారసురాలిని “

ఇలా ఓ విప్లవ కారిణి కావాలన్న ఓల్గా ఆశయం…
ఆ తర్వాతి కాలంలో తన సాహిత్యానికి మార్గ
దర్శకమైంది.

*స్వేచ్ఛాగీతం..!!

రవీంద్రుని గీతాంజలి గీతానికి ఇదిస్వేచ్ఛాను
వాదం .

“ఎక్కడ మనస్సు నిర్భయమో
ఎక్కడ శిరస్సు సమున్నతమో
ఎక్కడ జ్ఞానం స్వతంత్రమో

తండ్రీ .ఆ స్వేచ్ఛాతీరంలోనికి
మేల్కొలుపు నా దేశాన్ని “”

మహిళల హక్కులం..మానవహక్కుల పేర
రాసిన కవిత కూడా స్తీ ప్రధానమైనదే.అలాగే
“ఆకలే మిగిలింది ” కవిత కూడా ఇలాంటిదే

*విముక్త….(కథాసంపుటి)

ఓల్గా ‘విముక్త’ కథల సంపుటికి 2015వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ
పురస్కారం పొందింది.. ఓల్గా ప్రతి రచనా, దాని కంటే ముందున్న మరొక స్వీయ రచనకి కొనసాగింపు అనిపిస్తుంది.

‘విముక్త’ కథా సంపుటికి మూలం యుద్ధం- శాంతి లాంటి నృత్య రూపకాలలోనూ, ‘వాళ్ళు ఆరుగురు’ అనే ప్రయోగాత్మక నాటికలోనూ లీలామాత్రంగా గోచరిస్తాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే అది ‘స్వేచ్ఛ’లో కూడా లేశమాత్రంగా కనపడుతుంది. ‘కన్నీటి కెరటాల వెన్నెల’లో కూడా కనపడుతుంది. గమన, మాధవి, ఉమ లాంటి పాత్రలే అహల్య, రేణుక, ఊర్మిళ, శూర్పణఖ లాంటి పాత్రలు కూడా! కన్నీటి కెరటాల వెన్నెలలో రేణు మీద ‘ప్రేమ’ పేరుతో నియంత్రణ కనపడితే అది సీతగా మారుతుంది. మాధవి మీద పాతివ్రత్యం పేరుతో నియంత్రణ కనపడితే అది అహల్యగా మారుతుంది. గమన మీద, ఉమ మీద పనిచేసే నియంత్రణలే ఊర్మిళమీద శూర్పణఖ మీద కనిపిస్తాయి. ఈ అవిచ్ఛిన్నత ఇలా కొనసాగుతూ వస్తున్నది కనుకే ‘విముక్త’కే కాదు మొత్తం ఓల్గా సాహిత్యానికే ఈ బహుమతి ప్రకటించారన్న భావన వుంది. (వంశీకృష్ణ)

సీతారాముల మధ్య ఉన్న ప్రేమను యిప్పటి దాకా ప్రపంచం చూసిన దృష్టి వేరు. ఓల్గా చూపించిన దృష్టి వేరు. ఈ ప్రేమను అవ్యాజమైన ప్రేమ అనాలి. అది స్త్రీ పురుషులకి ఒకరి మీద మరొకరికి ఉండాలి. స్త్రీ పురుష సంబంధాలలో ప్రధానమైన సమస్య అధికారం. అధికారాన్ని అంటి పెట్టుకుని వచ్చే అనేకానేక, అనుబంధ పీడనలు. అధికారాన్ని అనుభవించడమూ, అధికారాన్ని వదులుకోవడమూ రెండూ సీత నేర్చుకుంది. అందువలననే పితృస్వామ్యపు సంకెళ్ళని తెంచుకుని సీత ‘విముక్త’ కాగలిగింది.

*స్వేచ్ఛ…నవల.!!

స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరి దయాదాక్షిణ్యం కాదు.. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం” అంటారు రచయిత్రి. ఓల్గాగారు 1987 లో రాసిన నవల ఇది.

కథలోని అరుణ చిన్నతనం నుంచి అణచివేతకు గురవటంవల్ల స్వేచ్ఛగా జీవించాలన్నది ఆమె
కోరిక. ఆ అణచివేతనుండి బయటపడాలని
ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

అరుణ తండ్రి, మేనత్త ఆంక్షలు లేకపోతే, తనకు ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే తన జీవితం హాయిగా సాగుతుందని అనుకుంటుంది. ఆ రెండు సాధించి ప్రకాశాన్ని పెళ్ళి చేసుకోవటం వల్ల స్వేచ్ఛ లభిస్తుందని ఆశపడుతుంది. అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలన్న దోరణి ప్రకాశంది. అతని అధికార
ధోరణి అరుణను కలవరపెడుతుంది. ఆర్థిక నిర్ణ
యాలు, సమాజ సేవ లాంటివి ప్రకాశంకు నచ్చవు.

బంధనాల స్వభావం తెలిసేకొద్ది అరుణకు స్వేచ్ఛ స్వరూపం అర్థమౌతుంది. సమదృష్టి లేనప్పుడు, భార్యాభర్తలు ఒకరికి ఒకరు అభిప్రాయాలను గౌరవించుకోలేనప్పుడు ఆ సంసారం సుఖంగా
అందాలనుకుంటుంది. 

సమాజం మొత్తాన్ని మార్చను నాకు చేతకాదని ౼ నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా?”
అలా చేయకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలోనన్ను నేను నిరూపించుకుంటాను. దానివల్ల నాకెంతో తృప్తి.
నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ?నా బతుకు నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు.
నా స్వేచ్ఛకు ఒక అర్థం వుండాలి.
ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నా పని. నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి” అని అనుకొని చివరకు బంధాలనుండి విముక్తి
కావాలనుకుంటుంది అరుణ.

*అర్ధనారీ (పెరుమాళ్ మురుగన్ )
అనువాదం ఓల్గా

తిరుచేన్ గోడ్ లోని అర్హనారీశ్వరాలయానికి సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని ఈ నవలలో మురుగన్ చిత్రీకరించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ శివుడు సగం శివుడిగాను, సగం పార్వతిగాను దర్శనమిస్తాడు. ఈ నవల ఆ స్థల ఇతిహాస గాధ. 2016 జులై 5వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యవాదులందరూ తీర్పుకు జేజేలు పలికారు ఈ తీర్పు పెరుమాళ్ మురుగన్ అనే రచయితకు తిరిగి కొత్త జీవితం తెచ్చిపెట్టింది. ఇంతకీ అంతటి చేటు నవలలో ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే
ఓల్గా సరళంగా, సహజంగా అనువదించిన ఈ అనువాదం తప్పక చదవాల్సిందే…
*ఓల్గా గారూ….ఆల్ది బెస్ట్.!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.