స్వరాలాపన-14

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: సింధు భైరవి రాగం 

Arohanam: S R1 G2 M1 P D1 N2 S

Avarohanam: S N2 D1 P M1 G2 R1 S

చిత్రం: భార్యాభర్తలు (1961)

గీతం: ఏమని పాడెదనో ఈ వేళా

సంగీతం: యస్ .రాజేశ్వరరావు

గీత రచన: శ్రీ శ్రీ

పాడినవారు: పి.సుశీల

పల్లవి:

ఏమని పాడెదనో ఈ వేళా

పాదస సాపదపా గామాగపా 

ఏమని పాడెదనో ఈ వేళా

పాదస నిసాపదపా గామాగపా 

మానస వీణ మౌనముగా నిదురించిన వేళ

పానిదమాగా సానిసగా పదనీపద నిస*గా* స*రి*ని*సా* 

ఏమని పాడెదనో…

పాదస నిసాపదదనిపా

 

చరణం 1:

జగమే మరచి హృదయ విపంచి (2)

పపనిద మపమా గమస రిగామా 

జగమే…  మరచి హృదయ విపంచి 

పపపదసా   మపమా గమస రిగామా 

గారడిగా వినువీధి చరించీ (2)

సాసపపా గమపద2ని నిపాద1పా 

కలత నిదురలో 

పపద ససస సగ*రి*2గా*  

కాంచిన కలలే

రీ*నిని నిరి*సరీ* 

గాలిమేడలై కూలిన వేళా

రీ*నిదాపదసా నీదమ రిమగరిసా 

ఏమని పాడెదనో…ఓ… ఓ … ఓ …. ఓ… ఓ… ఓ …. ఓ … 

పాదస నిసాపదదనిపా  మాగా గనిదనిపా 

 

చరణం 2:

వనసీమలలో హాయిగా ఆడే (2)

రాచిలుక నిను రాణిని చేసే (2)

పసిడి తీగలా పంజరమిదిగో

పలుకవేమనీ పిలిచేవేళా

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.