“నెచ్చెలి”మాట 

ధైర్యం చెబుతున్నామా?

-డా|| కె.గీత 

ఏది ముఖ్యం?
ఎప్పుడైనా
ప్రశ్న వేసుకున్నారా?
గొప్ప చదువు
పేద్ద ఉద్యోగం
బాగా డబ్బు సంపాదన

ప్రశ్నలు వేసుకుంటూ
కూచుంటే
పిల్లలకేం
చెబుతాం?

వాళ్ళ
గొప్ప చదువులు
వాళ్ళ
పేద్ద ఉద్యోగాలు
వాళ్ళ
డబ్బు సంపాదనలు
వాళ్ళకంటే
మనకే కదా
ముఖ్యం

పొరుగు వాళ్ళతో పోటీ
బంధుమిత్రులతో పోటీ
అన్నిటికీ
అన్నిటిలో
మన
పిల్లలే
గెలవాలన్న
అర్థం లేని
పోటీ

అన్నీ
గొప్పవిషయాలే
చెబుతాం
బాగా చదువు
పేద్ద ఉద్యోగం
బోల్డు సంపాదన

కానీ
ఒకే లక్ష్యం ఉండక్కరలేదని
ఏం లేకపోయినా నిరాశ పడొద్దని
ర్యాగింగ్ కే ప్రాణాలు తీసుకోనక్కరలేదని
చెప్పామా?

కులం
మతం
వ్యవస్థ
వివక్ష
అవసరమైతే
జీవితమంతా
పోరాటం చెయ్యాల్సిందేనని
ఎక్కడా వెనుతిరగాల్సిన
పనిలేదని
చెప్పామా?

నిలబడడం
ముఖ్యం
మనుగడ
ముఖ్యం
అసలు
జీవించి ఉండడం కంటే
ఏది ముఖ్యం?
అని ఎప్పుడైనా
చెప్పామా?

అసలు ఆడపిల్లలకి
ఎప్పుడైనా
దేనికైనా
ఎవరమైనా
ధైర్యం చెబుతున్నామా?

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఫిబ్రవరి 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ఏ. రాఘవేంద్రరావు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: “పెద్దరికం” కథ, రచయిత ఆదోని బాషా

ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.