“నెచ్చెలి”మాట 

సత్యమేవజయతే

-డా|| కె.గీత 

సత్యమేవజయతే!

అంటే
ఏవిటంటారు?

అయ్యో
ఎలక్షన్లు
వస్తున్నాయి
ఆమాత్రం తెలీదా?

సత్యమే
జయించును
కాబట్టి
సత్యమే
పలుకవలెను

అర్థం
బావుంది
కానీ
ఆ పేరు
గల వారెవరూ
నిలబడ్డం లేదే !

అయినా
నిలబడ్డ వాళ్ళంతా
సత్యమే
పలుకుతారనా?

అయ్యో
నిలబడ్డ వాళ్ళు
కాదండీ-
వారితో పోటీ చేసేవారు
ఎదుటివారిని
ఓడించడానికి
లోపాయకారి
ఆయుధంలా
తవ్వి తీస్తారే
అదన్నమాట!

అమెరికాలోనా?
ఇండియాలోనా?
యూరప్ లోనా?

ఎక్కడైనా
పరిస్థితి
ఒక్కటే

సత్యము
పలికే
విధానంబు
మాత్రమే
వేరు వేరు!!

హయ్యో-

ఒకరికి
సత్యమయ్యేది
మరొకరికి
అసత్యం!

ఒకరికి
అసత్యమయ్యేది
మరొకరికి
సత్యం!!

అయినా
ఒక్క
“అ” తేడాలో
ఏముంది?

ఎడ్జస్టు కావచ్చుగా!

అన్ని
ఎలక్షన్లలోనూ
సెలక్షన్లలోనూ
ఎడ్జస్టు
అవుతూనే
ఉన్నాం-

అందుకే
మన బతుకులిలా
తగలడ్డాయి!!
ముందా
దిక్కుమాలిన
స్లోగన్లని
తగలెయ్యండి!!!

అయ్యో
అది
స్లో- గన్
కాదండీ
ఫాస్ట్ – గన్

ఏది ఎలా మారినా
తను రవ్వంతైనా
మారని
నిజం!
సత్యం!

సత్యమేవజయతే !!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

సెప్టెంబరు 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: పి.సురేఖ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: సంపాదకీయం
ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-అక్టోబర్, 2023”

  1. ఓటు వేయాలంటేనే చిరాగ్గా వుంది. ఒకర్ని ఒకరు ఛీ, థూ .. అనుకోవడం తప్ప ఎక్కడి చెత్త అక్కడే వుంది. ధూళి, దుస్తితి multiply అవుతున్నాయే కానీ …. సమర్థవంతమైన పాలన లేదు. ఎక్కడుంది లోపం?

Leave a Reply

Your email address will not be published.