తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , డక్కలి జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది? , కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా , నోబెల్ కవిత్వం , అదే నేల (ముకుందరామారావు) , తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ) , యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్ ), పాపినేని శివశంకర్ కథలు , తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ :సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు , ప్రమేయాలు, పరికరాలు, 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం (ప ర్ స్పె క్టి వ్స్), పాదిరిగారి అబ్బాయి (ఇండస్ మార్టిన్), శిరీష కోమలం - దాసరి శిరీష సాహిత్యం, జీవితం, ఒక దీపం : వేయి వెలుగులు - నంబూరి పరిపూర్ణ జీవితం వ్యక్తిత్వం సాహిత్యం… వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.
కథా కథనం ఒక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథ పై పరామర్శ) -ఎ. కె. ప్రభాకర్ ఇక్కడ చాలా మంది కథను చదివారు, ఇప్పుడు విన్నారు. కానీ నేనైతే చూశాను. గీత ముఖంలో ప్రతిక్షణం కదలాడిన ఫీలింగ్స్, వాటి వ్యక్తీకరణ రీతి, చదివేటప్పుడు గొంతులో వినిపించిన ఉద్వేగం, మాటల్లో యెక్కడయెంత అవసరమయితే అంత వూనిక, ఆ మాట వైఖరి … యిలా యిదంతా ఒక పెర్ఫార్మెన్స్. […]
(పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన) అసమానత నుంచి సాధికారత దిశగా -ఎ. కె. ప్రభాకర్ నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా, వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన […]