కృష్ణ గుగులోత్ యాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు తెలుగు మరియు హిందీ భాషలలో రచనలు చేస్తున్నారు, కవితలు,
కథలు ,రివ్యూలు
ఓ మూడొందలకు పైగా
ఫేస్బుక్ & కవిసంగమం వేదికగా వ్రాసారు. 2018 మరియు 2020 సం"ల్లో కేంద్రసాహిత్య అకాడెమీ
ఆహ్వానం మేరకు సెమినార్స్ లో పాల్గొని బంజారాల జీవన
విశేషాల గురించి ప్రసంగించి
పరిశోధన పత్రాలు సమర్పించారు.
గారడి -కృష్ణ గుగులోత్ ప్రకృతి కట్టుకున్న ఆకుపచ్చని కోటల్లాంటికొండల నడుమ కొలువై నాలుగు గిరిజన గూడేలకు-తండాలకు మా నాచారంబడే నాడు గిరి గుమ్మపు విద్యాదీపమై ఓ వెలుగు వెలిగింది, అమ్మ మంగ్లి నాయన లక్పతీల పట్టుదలకు ప్రతిరూపమై ప్రతి తరగతిలో ప్రథముడిగా నిలిచి, విద్యా వన్నెల్ని అనుభూతులుగా మూటగట్టుకున్న నాకు, నాటి ఆ బాల్యం ఇప్పటికీ నా .. గుండెసడి అంటే అతిశయోక్తియేమి కాదు, ఎందుకో మనస్సుకు మబ్బుపట్టినప్పుడల్లా ఆ మకిలంటని తండా – గూడెపు దోస్తానాల తలపుల్ని అప్రయత్నంగానే […]