నారీ “మణులు”

కందుకూరి రాజ్యలక్ష్మి

-కిరణ్ ప్రభ

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 – ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి. నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించారు. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య, కొండమాంబ. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం గారి వయసు 12 సంవత్సరాలు. భర్తకి చేదోడు వాదోడుగా సంఘసేవకార్యక్రమాలలో కూడా నిలిచారు.

భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించేవారు. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెళ్ళి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసేవారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజూ ప్రార్థనలు జరిపేవారు. సంగీతాన్ని అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు రచించారు.

******

https://youtu.be/5KxfgKiJwUw

Leave a Reply

Your email address will not be published.