“నెచ్చెలి”మాట 

 ఇంటిపట్టు

-డా|| కె.గీత 

ఒకటో దశ

రెండో దశ

మూడో దశ

……. 

ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు 

అయినా 

మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు

ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు… 

అయినా వాక్సిను తీసుకున్నాం కదా! 

ఇంకా కోవిడ్ ఏవిటి?

దశలేవిటి  అంటున్నారా?

సర్లెండి… ఇలా అనుకోవడమే బావున్నట్టుంది!

అన్నట్టు 

కోవిడ్ తీరని నష్టాలతోబాటూ 

కొన్ని  లాభాల్ని  కూడా కలిగించిదండోయ్- 

అందులో మనకి పనికొచ్చే ముఖ్యమైందేవిటంటే 

కాలికి బలపం కట్టుకుని తిరిగే వాళ్ళని కూడా 

ఇంటి పట్టున 

ఉండడం మాత్రం అలవాటు చేసింది 

ఒకప్పుడు

పగటిపూట  

ఇంట్లో ఉండడమంటే 

ఎంత అసహజం!

ఏదో 

సెలవో 

బందో 

పండగో 

అనారోగ్యమో 

అని అర్థం ఉండేది

ఇప్పుడు

ఇంటిపట్టున ఉండడమే సహజాతిసహజం!

అయితే 

ఇంటిపట్టున ఉండడం 

ఏవీ సులభం కాదండోయ్!

అది కూడా కష్టాతికష్టమే!!

అయితే  ఇంటిపట్టున ఉంటూ-

కృష్ణా రామా అనకపోయినా 

ఊరికే కూర్చోవడం కాకుండా 

నిమిషానికోసారి 

కనబడ్డదల్లా తినడం కాకుండా 

ఎదుట పడ్డ వాళ్ల మీదల్లా

చికాకు పడ్డం కాకుండా  

కొన్ని ఉపయోగపడే పనులేమైనా చేసారా?

అంటే 

మొక్కలకి అవసరం లేకపోయినా నీళ్లు పెట్టడం 

పాడవ్వకపోయినా  వస్తువులు పీకిపాకం పెట్టడం 

వంటివి కాదండీ-

కాస్త అటుగిన్నె ఇటుపెట్టో- 

ఏదో కూరలు తరిగిచ్చో- 

ఇల్లు ఊడ్చో-

పాపం రోజూ పోనీ ఇంటిపట్టున 

ఉండి 

ఇరవై నాలుగుగంటలూ వండివడ్డించే  

“ఆమె”కి 

ఒకరోజైనా సెలవిచ్చి 

పని భుజానేసుకున్నారా?

హమ్మయ్య!

లక్డౌన్ వదిలింది… 

ఇక ఇంటిపట్టున ఉండే బాధ తప్పింది

అని కాకుండా 

అయ్యో! ఇంకొన్నాళ్లు ఇంటిపట్టున ఉంటే 

ఆప్యాయంగా గడిపిన  క్షణాలు 

మరిన్ని ఉండేవని అనుకున్నారా?

*****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

 ప్రతినెలా వచ్చే నెచ్చెలి  పత్రికలో రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా పాఠకులైన మీకు నచ్చిన 3 రచనలు/ఆర్టికల్స్  మీద కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

 

*****

Please follow and like us:

3 thoughts on “సంపాదకీయం- అక్టోబర్, 2021”

  1. గీతా నెచ్చెలి పత్రిక నిజం గా నెచ్చెలి లాగే అలరిస్తుంది.మంచి శీర్షికలు,విలువైన సమాచారం,,ఆసక్తి గా చదివించే అంశాలు తో పత్రిక అందిస్తున్నావు.
    అసలు ప్రాప్తం వుంటేనే కనకనారాయనీయం చదవ గలగటం.
    సంధ్యా యల్లాప్రగడ రచన ఆరంభం మే ఆసక్తికరం గా ఉంది.ఈ మధ్య ఆమె రచనలు ఎక్కువగా చదువు తున్నాను. ఏ విషయం చెప్పినా సాధికారిక తతో వ్రాస్తున్నారు.

  2. నమస్తే మేడమ్ గారు…చక్కని మీ ఇంటిపట్టు భాషపై , వాస్తవిక పరిస్థితులపై మీకున్న పట్టును తెలియజేసింది. అర్థంకాని భావాల అరణ్యంలో పాఠకుల బుర్ర తిరిగేలా చేసేది గొప్పకవిత్వం అంటారేమో కానీ… నాలాంటి మధ్యతరగతి సాధారణగృహిణులకు ఎంత హాయిగా ఉందో మీ కవిత. అబ్బ ఇదంతా నా బాధే, నాలోపలి మాటే అనిపించేలా . ఎన్ని లాక్డౌన్లు వచ్చినా ఆమెకు లేనిది సెలవేనండీ. ఇంటిపట్టున ఉండి గృహహింస పెట్టే నాథులు పెరిగారు కూడాను. ఎండమావి అనలేను ఆప్యాయత ,అనురాగాలు పంచే మహానుభావులు కోటికొక్కరు ఉంటారు సుమా! మీరు చెప్పినట్లు మరిన్ని ఆప్యాయ క్షణాలను కోరుకునే వారుంటే వారికి వందవందనాలే.

Leave a Reply

Your email address will not be published.