శాంతిశ్రీ పండిట్

-ఎన్.ఇన్నయ్య

          ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల  ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు.  అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే పెంచమని ఆంజనేయులుగారు చెప్పారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఆంజనేయులుగారు ఇండియా తీసుకురావడానికి సిద్ధపడ్డారు.

          తెనాలి తాలూకా మోపర్రుకు చెందిన ఆంజనేయులు గారు మదరాసులో స్థిరపడి అక్కడే ఉద్యోగాలు చేస్తుండేవారు. కుమార్తెను తనతోపాటు పెంచటానికి మదరాసు తీసుకువచ్చారు. అక్కడ స్కూలు విద్య, కాలేజీ విద్య, యూనివర్సిటీ విద్య అంతా శాంతిశ్రీ పూర్తిచేసింది. ఉద్యోగరీత్యా ఆంజనేయులుగారు మదరాసులో, ఢిల్లీలో ఉండటం వలన శాంతిశ్రీ కూడా వివిధ ప్రాంతాల భాషలు, సంస్కృతి త్వరగా స్వీకరించ గలిగింది. శాంతిశ్రీ చదువు పూర్తయిన తర్వాత మద్రాసులో, గోవాలో, ఢిల్లీలో వివిధ యూనివర్సిటీలలో చదివింది. ఆవిధంగా బహుభాషా కోవిదురాలు కూడా అయింది. శాంతిశ్రీ ఇంగ్లీషులో మంచి వక్త. అనేక ప్రామాణిక పత్రికలకు వ్యాసాలు రాసింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటించి అనేక సెమినార్లలో ప్రసంగించి మంచి పేరు తెచ్చుకున్నది. చివరకు మహరాష్ట్రలోని పూనా యూనివర్సిటీలో ఉద్యోగం చేసింది. అక్కడే వివాహం కూడా చేసుకుంది. శాంతికి ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడింది. శాంతిశ్రీ తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతుంది. శాంతిశ్రీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతుందని వ్యాఖ్యానించేవారు. ఎప్పుడూ పర్యటించటం ప్రపంచ స్థాయిలో అనేక సెమినార్లలో పాల్గొనటం వివిధ పత్రికలకి వ్యాసాలు రాయటం శాంతిశ్రీకి కొట్టిన పిండి అయ్యింది.  నిరంజన్ పండిట్ అనే మహరాష్ట్ర వ్యక్తిని పెళ్ళి చేసుకుని శృతి అనే అమ్మాయిని కన్నది.

          తరువాత ఆమె భర్తకు విడాకులిచ్చింది. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ గా నియమితురాలైన శాంతిశ్రీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా విశేష అనుభవం గడించింది. ఆమెకు వివిధ పండితులు, నిపుణులు పరిచయమయ్యారు. తెలుగు విప్లవ కవి శ్రీశ్రీతో సన్నిహిత పరిచయం ఉండేది. కీ.శే. కోమల, ఆమె కుమార్తె నవీనలతో కుటుంబ మిత్రురాలుగా శాంతిశ్రీ వుండేది. అనేక ప్రపంచ సెమినార్లకోసం ప్రామాణిక పత్రాలు సమర్పించింది. అనేక దేశాలు కూడా పర్యటించి ప్రసంగించి రాజకీయ శాస్త్రంలో ఆరితేరిన వక్తగా పేరుపొందింది. తండ్రి ఆంజనేయులు చనిపోయిన తర్వాత శాంతిశ్రీ పూనాలో స్థిరపడింది. కొన్నాళ్ళు గోవాలో ఉద్యోగం చేసింది. మొదటి నుండీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీతో విద్యార్థినిగా, పండితురాలిగా సన్నిహిత పరిచయాలు పెంచుకున్నది. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ గా నియమితురాలైన శాంతిశ్రీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయిని తీసుకురావాలని ఆశించవచ్చు.  59 సంవత్సరాలుగల శాంతిశ్రీ ఐదేండ్ల పాటు వైస్ ఛాన్సలర్ గా వుంటుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.