“నెచ్చెలి”మాట 

ముందుకు నడిపించిన 2022

-డా|| కె.గీత 

నెచ్చెలి ప్రస్థానంలో
మరో
విజయవంతమైన
సంవత్సరం
2022
మీ అందరి
తోడ్పాటుతో
పూర్తి చేసుకుంది-

నెచ్చెలి తొలి ప్రచురణ
కావడంతో బాటూ
తెలుగు సాహిత్య చరిత్రలో
మైలురాయిగా
నిలిచే
గత ముప్పయ్యేళ్ల (1993-2022)
స్త్రీ వాద కవిత్వ సంకలనం
“అపరాజిత”
93 మంది
కవయిత్రుల
168 కవితలతో
వెలువడింది
2022లో-
రెండు
తెలుగు రాష్ట్రాల్లో
ఆవిష్కరణ
జరుపుకుంది –

2,55,000 పైచిలుకు
హిట్లతో
అత్యంత
విజయవంతమైన
అంతర్జాల
పత్రికగా
ముందుకు
దూసుకు వెళ్తోంది
నెచ్చెలి-
——
నిజానికి
2022
ప్రపంచానికి
యుద్ధాన్ని
నష్టాల్ని
ద్రవ్యోల్బణాల్ని
అల్లకల్లోల
ప్రకృతి
వైపరీత్యాల్ని
చవి చూపించింది
అయినా
ముందుకు
నడిపించింది
—–
ఒక విధంగా
మనందరికీ
ఎక్కడో
ఓ చోట
ఇక
ఆగిపోతున్నామని
అనిపించే
సందర్భం
ఒక్కోసారి
వస్తుంది
అప్పుడప్పుడు
అయినా
రెండు
దార్లు
ఉంటాయి
ఒకటి
గగనతలం-
రెండు
అధః పాతాళం-
ఎటు వెళ్లాలన్నా
కష్టమే-
సరైన
ఎంపిక
ఎప్పుడూ
ముఖ్యం
దేన్ని
ఎంచుకుంటామో
అదే
మన భవిష్యత్తు

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

నవంబరు 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ఎల్.సుజాత

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: కథామధురం- ఆర్.దమయంతి 

ఇరువురికీ అభినందనలు!

*****

Leave a Reply

Your email address will not be published.