“నెచ్చెలి”మాట 

చిన్న జీవితం!

-డా|| కె.గీత 

చిన్న జీవితం
అనగా నేమి?
వేదాంతంబు కాదు
నిజ్జంబుగ నిజ్జమే

పేద్ద జీవితం
అనుకుని
ఎన్నో
వాయిదాలు
వేస్తాం

ఒక
కలయికనీ-
ఒక
ముఖాముఖినీ-
చివరికి
ఒక
పలకరింపునీ –

కానీ
చిన్న జీవితం
అని
ఎప్పుడు
అర్థం అవుతుందీ?

మన
కళ్ళెదురుగా
ఉన్న
మనుషులు
అర్ధాంతరంగా
మాయమైపోయినప్పుడు

ఎంత రోదించినా
ఏవీ
వెనక్కి
రానప్పుడు

జ్ఞాపకాలు
మాత్రమే
చెవుల్లో రొద
పెడుతున్నప్పుడు

మరి
చిన్న జీవితం
అని
తెల్సిపోయేకా
చేయవల్సిందేమీ?

ఇప్పటికిప్పుడు
తేల్చుకోవాలా?
రేపు
చూసుకుందాం!
ఎల్లుండి
మాట్లాడుకుందాం!
మరెప్పుడైనా
ఆలోచించుకుందాం!

హయ్యో
జీవితం
చిన్నదండీ!
వాయిదాకి
రేపనేది ఉంటే కదా!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఏప్రిల్  2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: డా. సమ్మెట విజయ

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: సింధుతాయి సప్కాల్ – నీలిమ వంకాయల

ఇరువురికీ  అభినందనలు!

*****

Please follow and like us:

6 thoughts on “సంపాదకీయం- మే, 2023”

  1. చిన్న జీవితం చదవగానే నా కళ్ళు నా అదుపు తప్పినవి. మా వారు చనిపోయిన రోజు! అన్ని సమకూర్చు కొని, అసలైన జీవితం మొదలైన సమయానికి, నాకు ఒంటరి పోరాటం మిగిలింది. వాస్తవాన్ని కవిత రూపంలో అందజేశారు. ఒకసారి నా గతంలోకి వెళ్లాను.🙏

  2. చిన్న జీవితం కవిత లో మీరు చెప్పిన సత్యం అందరూ ఎరిగిందే అయినా మన రోజువారీ కోపాలు ఇర్శ్య అసూయలు మధ్య మానసిక బలహీనతకు గురు అయిపోయి మర్చిపోకుండా చాలా చకగా కవిత ద్వారా గుర్తు చేశారు.

  3. గీత గారి “చిన్న జీవితం “ సంపాదకీయం
    ‘జీవితం బుద్బుదప్రాయం,’’దినదిన గండం నూరేళ్ళ ఆయుశ్సు అన్న నాడిని/ సామెతకు గుర్తు చేస్తుంది.
    ‘రేపు ‘అనే వాయదా వేయక అనుకున్నది అనుకున్నప్పుడే చేయడం ;చూడాలని/ కలవాలనుకున్న వారిని
    కలిసి పలకరించడం చేయమని జీవితం చాల చిన్నదనే సత్యాన్ని తెలిపే మంచి సందేశాన్ని ఇచ్చారు

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు విజయలక్ష్మిపండిట్ గారూ!

  4. నెచ్చెలి మాట చిన్న జీవితం అని చాలా చక్కని కవిత ద్వారా చాలా బాగా చెప్పారు గీతా మేడమ్ గారు💐🍩💐💐💐💐🌹🤝🌹

Leave a Reply

Your email address will not be published.