ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          అత్తలూరి విజయలక్ష్మి స్వస్థలం హైదరాబాద్. 1974 సంవత్సరంలో ఆకాశవాణి, హైదరాబాద్, యువ వాణి కేంద్రంలో “పల్లెటూరు” అనే ఒక చిన్న స్కెచ్ ద్వారా సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

          అనేక ఒడిదుడుకులు, ఆటంకాల్ని అధిగమిస్తూ సుమారు మూడు వందల కధలు, ఇరవై నవలలు, అనేక వ్యాసాలు, నాటకాలు, టెలిప్లేలు, టివి సీరియల్స్, కాలమ్స్, కవితలు రాశారు. వీరి కథలు, నవలలు, నాటకాల మీద యూనివర్సిటీ విద్యార్ధులు పి.హెచ్.డిలు చేస్తున్నారు.

ప్రచురింపబడిన రచనలు:

కధాసంపుటులు:

అపూర్వ
అపురూప
ఆనాటి చెలిమి ఒక కల
ఒప్పందం ..
ఒక కోయిల గుండె చప్పుడు
లాక్ డౌన్ వెతలు
అష్టావక్ర నాయికలు
నాటకాలు
అంతర్మధనం
మ్యాచ్ ఫిక్సింగ్
నీహారిక
యవనిక
హ్యాంగ్ మి ప్లీజ్
నవలలు
దత్తపుత్రుడు
మహావృక్షం
అమావాస్య తార
నేనెవరిని?
ప్రతిమాదేవి
గూడు చెదిరిన గువ్వలు
అర్చన
తెల్లగులాబి
అతిధి
ఆ గదిలో
పేరైనా అడగలేదు
శ్రీకారం
నటి
రాగం తీసే కోయిల
కడలి
ప్రేమిస్తే ఏమవుతుంది ?
బొమ్మ
ఏ పుట్టలో ఏమున్నదో !
నాన్న లేని కొడుకు
దూరం
మాగాడు
రెప్పపాటు కాలం
కాలం మింగిన కలం (మా నాన్నగారు కొన్ని జ్ఞాపకాలు )

టి.వి.సీరియల్స్:
నివేదిత, మరో ఝాన్సి , క్రాంతి , ఈ కథ ఎవరు రాసారు?, బలి, ఇంకా అనేకం

నవలలు:
అతిథి, బొమ్మ, తెల్లగులాబీ, ఆ గదిలో, మహావృక్షం కన్నడలో అనువదించబడి పుస్తక రూపంలో వచ్చాయి.

పురస్కారాలు:

బలి, నివేదిత కు unisef పురస్కారం, కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చాయి.

జ్యోత్స్న లిటరరీ అవార్డు, నార్ల విశిష్ట పురస్కారం, అబ్బూరి రుక్మిణమ్మ స్మారక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, అపురూప అవార్డ్, సిరికోన కోడూరి పార్వతి స్మారక విశిష్ట రచయిత్రి పురస్కారం, జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ జీవన సాఫల్య పురస్కారం, ఇంకా అనేక పురస్కారాలు లభించాయి.

*****

Please follow and like us:

2 thoughts on “ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇంటర్వ్యూ చేసిన డా.గీత గారికి, విజయలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు

  2. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.డా. గీత గారికి,
    విజయలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు ఎన్నో కథలు, నవలలు, నాటికలు మరెన్నో బహుమతులు, పురస్కారాలు పొందిన మేటి రచయిత్రి అయిన విజయలక్ష్మి గారు నాలాంటి వారికి గురువు సమానులు.

Leave a Reply

Your email address will not be published.