బతుకు చిత్రం-35

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత  

***

          రామలచ్చిమి డాక్టర్ గారి ఇంట్లో మనుమరాలితో చేరి వంటపనికి కుదురుకుంది. డాక్టర్ గారి భర్త కూడా వీరిని మనస్పూర్తిగా ఆహ్వానించాడు. పని చేసి వెళ్ళిపోయే పని వాల్లలా కాకుండా తమకు ఆనందాన్ని పంచడానికి వచ్చిన ఆ చిన్నారిని లాలనగా చూడసాగారు.

          మరోవైపు ఆ కుటుంబానికి రామలచ్చిమి ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వాలనే పట్టుదలా పెరిగింది.

          డాక్టర్ గారు ఆ రోజు రామలచ్చిమిని తనతో పాటు హాస్పిటల్ కు తీసుకువెళ్ళింది.

          తనకు ఏ అనారోగ్యమూ లేదని సంతోషంగా ఉన్న రామలచ్చిమితో నీకు రొమ్ము క్యాన్సేర్ ఉందని ఎలా చెప్పాలన్న ఆలోచన ఫలితంగానే తమ హాస్పిటల్ స్వచ్చందం గా నిర్వహిస్తున్న క్యాంప్ కి తీసుకెళ్ళింది.

          గ్రామీణ ప్రాంతాల్లో రొమ్మును పరీక్షించుకొని ముందుగానే క్యాన్సేర్ ను పసిగట్ట గల అవగాహన పెంచడానికి సునిక్షితులయిన సిబ్బందితో మాట్లాడించింది.

          వీరు వెళ్ళిన గ్రామంలో మహిళలు సిగ్గు పడుతుండడం డాక్టర్లు వారికి నచ్చజెప్పి పరీక్షలు చేయడం స్వయంగా చూసిన రామలచ్చిమి ఇల్లు చేరిన తరువాత…

          అమ్మా ..! పొద్ధటి సంది జరిగినది చూసినాక నాకూ ఆ లచ్చనాలే ఉన్నట్టు అనిపిత్తాంది నన్నోపారి సూడుండ్రమ్మా ! అన్నది.

          లచ్చిమి ..! నువ్వు చాలా తెలివైనదానివి కాబట్టే తొందరగా గ్రహించావు. నీకు ఎవరికివారే ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. దీని ద్వారా నువ్వూ ఎంతో మందికి చైతన్యం కలిగించవచ్చు, దీన్ని మేము సిబీ ఈ గా పిలుస్తాము.

          సరే ! అదంతా నీకు అవసరం లేదు, రేపే నీకు అన్ని పరీక్షలూ చేస్తాను , అన్నది.

డాక్టర్ భర్త అడిగాడు.

          తనకు ఆల్రెడీ ఉందని తెలిసాక దోబూచులాడడం అవసరమా? అని.

          అవసరమే. ముందే నీకు ఈ జబ్బు ఉంది, వైద్యం చేయించుకోమంటే ఆమె తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఒప్పుకునేది కాదు. కానీ, ఈ రోజు విలేజ్ కు తీసుకువెళ్ళి తన ఎదురుగా పరీక్షించటం ఇలా జరగడం వల్ల ఆమెలో ఒక ధైర్యం వచ్చినట్టు అయింది.

          మీకు గుర్తుందా? మనం కొత్తలో డాక్టర్లుగా ప్రాక్టిసు మొదలుపెట్టిన తోలినాళ్ళలో మీ చిన్నమ్మకు బాగు చేసే క్రమంలో అత్యుత్స్సాహంలో ముందే చెప్పడంతో ఆమె భయం తో ఆరునెలలు బతికే మనిషి ఆరు రోజులలో చనిపోయింది. పూర్తిగా మన తప్పిదం వల్లే కదా! అందుకే ఇక ముందు జాగ్రత్తగా ఉండాలనే కదా! మన తాపత్రయం. ఆవిడ కూడా ఈ వయసులోనే కదా క్యాన్సేర్ బారిన పడింది. ఆ బాధతోనే ట్రీట్మెంట్ చెయ్యకూడదని కూడా నిర్ణయించుకున్నది. కాని, రాయలచ్చిమి లాంటి వాళ్ళు ఈ మధ్యన చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతుండడంతో అవగాహన కల్పించడానికి పూనుకున్నాను .

          నేను ఈ రోజు ఇలా చేయడం వల్లే ఆమెలో ఒక నమ్మకం కలిగింది.

          అది ఆమెకే కాదు రేపు ఆమెకు నయం అయిన తరువాత ఎందరికో ఆమె ఒక మోడల్ గా ఉంటుంది.

          అంటే ఆమెను ఒక రకంగా మానసికంగా సిద్ధం చేశావన్న మాట.

          అంతేగా! తను ఎంత విశ్వాసం తో ఉంటె అంతా తొందరగా కోలుకుంటుంది. ఇది ఆమెకే కాక ఎంతో మంది ఇలాంటి గ్రామీణ మహిళలకు తోడ్పడుతుంది.

          డాక్టర్ గా నిన్ను చూసి గర్విస్తున్నాను,పేషెంట్ ను ఇంత సున్నితంగా హాండిల్ చేయడం రియల్లీ గ్రేట్ మెచ్చుకున్నాడు .

          నేను లచ్చిమిని త్వరగా కోలుకునేలా ట్రీట్మెంట్ తో సక్సెస్ అవ్వాలని విష్ చేయండి అంది.

          ఆల్ ది బెస్ట్ మై డియెర్ అన్నాడు షేక్ హాన్దిస్తూ.

          ఇక నుండి క్యాన్సేర్ బాధితులకు మన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఉచితంగా అందించాలని కూడా అనుకుంటున్నాను.

          ఓహ్ !గ్రేట్ ……

          నీకు ఈ ఆలోచన కలిగినందుకు నాక్కూడా ఆనందంగా ఉంది.

          ఎంత సంపాదిస్తే ఏం లాభం? మనకు సంతానం లేక ……..పూర్హి చేయలేకపోయిం ది.

          ఏయ్ …ఏమిటిది ?డాక్టర్ కంట్లోనే కన్నీరోస్తే ఇక మామూలు వాళ్ళ సంగతేమిటి? అవును కదా! అంతలోనే నవ్వేసింది.

          ఏమయినా రాయలచ్చిమికి బాగయ్యే వరకు ఆ పిల్లను ఉంచుకొని మన ముచ్చట తీర్చుకుందాం.

          అలా ఆ ఇద్దరూ స్థిమితపడ్డారు .

***

          కమలకు ఇంట్లో జరుగుతున్న సంఘటనలు అన్నీ కొంత కలవరాన్ని కలిగిస్తు న్నాయి.

          ఎంతో ఉత్సాహంగా తిరిగే రాయలచ్చిమి అనారోగ్యంతో ఉన్నా డాక్టర్ గారింట్లో పనికి కుదరడం, జాజులమ్మ తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం , తను మాత్రం తిని కూర్చోవడం ఆమె కలవరానికి కారణాలు.

          కమలా ! ఏం సోచాయిస్తున్నవే ? అడుగుతూ వచ్చింది సత్తి .

          సత్తి తన ఊరుదే , ఆమె అత్తగారు కూడా ఇదే కావడంతో అప్పుడప్పుడు వస్తూ పలకరిస్తుంది.

          ఏమున్నదే ?

          ఏమ్లెందే , గిట్లున్నవా ? నాకెరుకేలే ..

          ఎంటిదే …

          అబ్బా ..నంగనాచి తుంగబుర్రని ….

          అబ్బా ..!సతాయించకే ..

          అయ్యో ..ఈ మాత్రం దానికే ? రేపు కాన్పయినంక పిల్లో ,పిలగాడో అయినంక వాడు గావురం జేత్తే గూడ గట్నే అంటవా?

          అది అప్పుడు జూద్ధం,ఇప్పుడు నువ్వెందుకచ్చినవ్ ?

          నేను అచ్చిన పని జెప్త, అట్నే నీ సోచాయింపు గూడ జెప్త.

          అంటే …

          ఏమున్నది? నువ్వు సోచాయిస్తున్నది నీ కడుపులున్న బిడ్డ గురించే కదా!

          అవుననలేదు, కాదనలేదు.

          ఎందుకే? నా దగ్గర దాపురికం? నాకు తెలుసు. ఈ తాపన్న నీకన్న మగోడు పుట్ట కుంటే ఎట్లనే కదా!

          కాకున్నా, అవునన్నట్టే మౌనంగా ఉండిపోయింది.

          అదే నిజమని నమ్మి సత్తి చెప్పడం మొదలు పెట్టింది.

          నువ్వేం గుబులు పడకు. దానికి తొవ్వ నేను జూపిత్త గదా!

          అనుమానంగా నమ్మలేనట్టు చూసింది.

          ఏందే? బెదిరిన గోడ్డు లెక్కన గట్ల జూత్తవ్. నేను జెప్పేది సత్తెంగ సత్తేమే.

          ఆసక్తిగా చూడడంతో, సత్తి,

          మన పక్కూర్లో వంటల జానక్క చెల్లె అత్త వాళ్లూల్లె ఏ బిడ్డ గావాల్నంటే ఆ మందు బోస్తది, ఓ పారి పొయ్యి  పోపిచ్చుకున్న వంటే నీకు తిరుగు లేదు. మల్ల.

          ఎవలూ …..అన్నది.

          అయ్యో! అప్పుడే మర్సినావే? వంటల జానక్క …

          అంటే లగ్గాలకు మంచిగ అగ్గువలనే వంటవండుడే కాక పేదోళ్ళకు ఉచితంగనే వండి పెట్టటామె …

          ఔ ..గదోక్కటేనా? ఆమె వంటల అన్ని రాగులు, మక్కలు, గోధుమలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు గిట్ల ఎనుకటి గడ్క, జావ రుచులతోని బలమయిన రుచులు చూపిచ్చి ఆరోగ్యానికి వాటి వసరం గూడ అర్థం చేయించుతదట. నీకీ సంగతి తెలవదు కదా? గా మొన్న హైదరాబాద్ ల ఏరే ఏరే దేశాల నుంచి సుతం పెద్ద్ పెద్దోళ్ళు మన దేశంల పెద్ద మీతిన్గని వత్తే ఈమెను గూడ పిలిసిండ్రట. తీర్ల తీర్ల వంటలు చేసిపెట్టడానికి.

          ఆ …

          గట్ల నోరేల్లవేట్టకే. ముందుగాల ఇన్నప్పుడు మా పని సుతం గంతే అయింది.

          ఆ మీటింగుకు పదానమంత్రి సుతం అచ్చిండట. ఎట్లెట్ల జేత్తరు ఏందని మాట్లాడిచ్చిండ్రాట.

          అవునా ..?

          ఆమె ఒక్కతనేంది? ఆ పంట తీసేటోళ్ళను సుతం పిల్సి ఎట్లెట్ల పండిత్తరు?దేనికెంత కట్టం బడుతది? అమ్దాను ఎట్లున్నది? గిట్ల అన్ని ఆరాలు తీసి , మీరు పంచి పని జేత్తాండ్రు. గిట్నే దేశమంత జేత్తే మన దేశంల రోగాలు ఎక్కువ తక్కువ రాకుండ ఉంటుండే. అని మెచ్చుకొని పట్టు పీతాంభారమసొంటి తువాలు గప్పి మర్యాద జేసిండ్రట.

          దినాం ఆ ముచ్చటే కనబడ్దోల్లకేల్ల జెప్పి సంబర పడ్డది.

          ఔ ..ఔ ..ఇప్పుడిప్పుడే యాది వడుతాంది. కరెక్టే. గది, సిరిధాన్యాల ఏడు ఈ ఏడు అని జెప్పి అంతట ఎనుకటి రొట్టెలు, సంకటి ఇట్లాంటియి తినాలని, పోల్లగాన్డ్లకు బల్లెల్ల గుడ గివ్వే పెడుతాండ్రనంగ ఇన్న. పొల్లగాండ్లుగా నూనెల ఏసీ తీసినయి తినుడు కంటే ఇట్లాన్టియి తినవేడితే దుడ్దేలోలె ఉంటరని గుడ జెప్తాండ్రు.

          ఆ ..గిప్పుడు బాగ యాది వట్టినవ్. గామె చెల్లె అత్త సుత గిట్ల మంచి పసరు వైద్యం జేస్కొని అచ్చరం ముక్క రాకున్నా తాతల తండ్రుల నుండి నేర్చుకున్న వైద్యంతోని బోచ్చేడు సంపాయించుతాందట.

          మల్ల ఒగప్పుడయితే  తీరొక్క రోగాలకు తీరోక్క మందులు తయారు చేసేదట, గని ఈ నడుమ రోగాలకంటే ఎక్కువ పిల్లలు గానోళ్ళు, ఆడోళ్ళు గావాల్నని, మగాళ్ళు గావాల్నని ఇట్లచ్చేటోల్లు ఎక్కువయ్యేసరికి ఇగ అవిటి మందులు తయారుజేయ్య తీరక ఇవిటియే ఎక్కువ జేత్తాందట.

          అత్త కోసం అడిగుతే బాగుండు.

          మీ అత్తకేమాయేనే?

          అప్పుడప్పుడు చాతగాకుంట ఉంటాంటే ,,

          ఏమన్న పడుచు పొల్లనా? పసి పొల్లనా? ఇంకా ఎగిరి దునికి ధూమ్ ధాం ఆడటానికి?

          గట్లగాదే ..అని చెప్పవోయ్యి ఆగి పోయింది.

          ముల్లె బయటే యద్దు, రోగం దాసుకోవద్దని శాత్రం. మీ అత్తకేంది? సెప్పు.

          ఏమ్లె ..ఏమ్లె నువన్నట్టు ఈడు వడే ..బలానికి ఏమన్న ఇత్తదాని. అన్నది మాట మార్చి.

          ఎందుకియ్యదు? గని. జాము జేత్తది. గీ మందయితే పక్కా.

          మరి నువ్వోపారి పోదామంటే పోదాం.

          ఔను గని మావోళ్ళు ఏమంటారో! అత్తయితే గిసొంటియి అస్సలే నమ్మది.

          ఔ మరి, మీ అత్త పెద్ద పెద్ద మందు బిళ్ళలిచ్చే పెద్ద డాక్టరమ్మ నాయె. అన్నది వెటకారంగా.

          గట్లనకే, ఆమె ఒప్పుకుంటేనే పని అయితది.లేకుంటే గంతే.

          నీ పిచ్చి గని, గి సొంటియి నమ్మదంటావ్! మల్ల సరే అనాల్నంటావ్, ఎట్లయితదే?

          ఏమయినా జాజులమ్మ సుత ఒప్పుకోవాలే .

          అక్క పెత్తనం ఓ వయిపు, అత్త పెత్తనం ఓ వయిపు ఉండంగ చెల్లెలి కాపురం లేక్కల్నే వున్నది గదా! నీ సంగతి.

          అంటే ..?

          అంటే లేదు, ఏం లేదు. సక్కగ రేపు ఎవ్వలకు చెప్పకుండా అచ్చేయ్, మగోడైతే అందరు గుర్రమేక్కినట్టు సంబురపడుతారు. ఏమంటవ్ ?

          సెప్పి సూడాలే.

          అల్లుదచ్చేదాంక అమాస ఆగుతదాని?

          నీకు నెలలు పెరుగక ముందే మందు పోయించుకోవాలే. లేదంటే పని చెయ్యక పోవచ్చు. ఎగిర్త పడు. అన్నది సత్తి .

          సరేలే సూత్తతీ.

          గట్లనకు ..అని జెప్తున్డ గా రాజయ్య వచ్చిన అలికిడి కాంగనే సత్తి మల్లత్త అని వెళ్ళిపోయింది.    

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.