జ్ఞాపకాల ఊడలు

(నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– దుద్దుంపూడి అనసూయ

ఎప్పుడు మొలిచానో ఆమె చెబితే గాని నాకుతెలియనే తెలియదు కానీతన అమృత హస్తాలతో లాల పోయటం విన కమ్మని జోల పాటతోనిదుర పొమ్మని జోకొట్టటం గుర్తొస్తూ ఉంటుంది నడక నేర్చిన సంబరంతోనేను పరుగెడుతుంటేపడిపోకుండా పట్టుకుంటు కోట గోడలా నా చుట్టూచేతులు అడ్డు పెడుతూ పహారా కాయటంగుర్తొస్తూ ఉంటుంది వచ్చీ రాని నా మాటలకేనేనేదో ఘన కార్యం చేసినట్లు నా నత్తి నత్తి మాటలనే నారాయణ మంత్రంలా నాలాగే పలుకుతూ పదే పదే పది మందితో పంచుకోవటంగుర్తొస్తూ ఉంటుంది పాల బువ్వ పెట్టేటప్పుడు బొజ్జ నిండిందో లేదో తడిమి తుది ముద్దతో దిష్టి తీయటం ఆమెని ఏమార్చి కట్టు కధలల్లిఉట్టుట్టి ఒట్లు పెట్టి పట్టు బడినప్పుడుఆమెతో తీపి తిట్లు తినడంగుర్తొస్తూ ఉంటుంది  ఆమెనే అనుసరిస్తూ అనుకరిస్తూ ఆటలాడే నాకు పలకా బలపం చేతికిచ్చి పాఠశాలలో  నన్నొదిలేసి  తిరిగెళ్లే తనలో బెంగా బెరుకూ నా పెళ్ళిలో అప్పగింతలప్పుడు  తన తడి కళ్ళలో మళ్ళీ చూడటంగుర్తొస్తూ ఉంటుంది  నేనమ్మనైనా అమ్మమ్మ నైనావటవృక్షంలా వృద్ధి చెందినాఆనాటి తన అమ్మ  తనం చాటున నా చిన్నతనమంతాఇంకా మదిలో మెదులుతూనే ఉందిఎన్నేళ్ళు గడిచినా అన్నీజ్ఞాపకాలై మనసు కొమ్మలను వీడకుండా మర్రి ఊడల్లావేలాడుతూనే ఉన్నాయి.

*****

3 thoughts on “జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)”

  1. అమ్మ ను తలచుకొనే మరొక మధురమైన జ్ఞాపకం
    రచయిత్రికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.