అయినా సరే! (కవిత)
అయినా సరే! -బండి అనూరాధ చిగురించి పండి ఎండి రాలి..ఆకుల వంటి వారమే మనం కూడా. ఒక్కోసారి,ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తేనిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోననిఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం. భ్రమల నేలలో అన్నీ బరువే అనుకునితేలికగా ఊపిరి తీసుకుంటూచెట్లనీడలో పడిన ప్రాణంలాతెరిపినపడుతూ… ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళివాడని పూలను కోసుకుంటూనిజంలా బ్రతికేస్తూ… వనాలలో వైనాలన్నీ పగటికి పూసివెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం. రాలడం తెలియదుగా..ఎప్పుడో..!! ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]
Continue Reading







































































