అనుసృజన

ఒంటరి స్త్రీ నవ్వు

హిందీ మూలం: సుధా అరోడా

అనువాదం: ఆర్.శాంతసుందరి

ఒంటరి స్త్రీదాచుకుంటుంది తన నుంచి తననేపెదవుల మధ్య బందీ అయిన నవ్వుని బైటికి లాగినవ్వుతుంది బలవంతంగాఆ నవ్వు కాస్తా మధ్యలోనే తెగిపోతుంది… ఒంటరి స్త్రీ నవ్వటంజనాలకి నచ్చదుఎంత సిగ్గూశరం లేనిదీమెమగవాడి తోడూ నీడా లేకపోయినాఏమాత్రం బాధ లేదు ఈమెకి… నోరంతా తెరిచి నవ్వేఒంటరి స్త్రీఎవరికీ నచ్చదుబోలెడంత సానుభూతి ప్రకటించేందుకు వచ్చినవాళ్ళుదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారుఆ సొమ్ము మరోచోట పనికొస్తుందని! ఆ ఒంటరి స్త్రీఎంత అందంగా ఉంటుందో…ఆమె ముఖాన ఒకరకమైన శూన్యభావం ఉన్నప్పుడుకళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్టు పరధ్యానంగా ఉన్నప్పుడునట్టకుండా ఒక్క వాక్యం కూడా మాట్లాడలేక పోయినప్పుడుమాట్లాడుతూ హఠాత్తుగావిషయం ఎక్కడ మొదలెట్టిందో,ఇంతకు ముందే ఏమందో మర్చిపోయినప్పుడుఅప్పుడు ఆ ఒంటరి స్త్రీ ముఖం ఎంత బావుంటుందో… (ఆమె ముఖాన అలాంటి శూన్యం పరచుకున్నప్పుడుమీరు చెప్పేది ఆమె చెవులకి చేరనే చేరదు.ఆమెని చూస్తే అనిపించదుఒక పూర్తి మనిషి ఎదురుగా నిలబడి ఉందనిమొత్తం మనిషి ఎదుట ఉన్నాసగమో ముప్పాతికో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది.మిగతా భాగం ఎక్కడ ఎవరికోసం వెతుకుతోందోఅది ఆమెకే తెలీదు.ఎంత అమాయకంగా కనిపిస్తుందో అలాటి స్త్రీ ! నవ్వు ఆమె ముఖాన ఉంటుందిఒక మాసికలా అతుక్కునిఏదో అనవసరమైన వస్తువులాచెయ్యి తగలగానే రాలిపోతుంది ముఖం మీంచి…

*****

Leave a Reply

Your email address will not be published.