కథాకాహళి- 28 చాగంటి తులసి కథలు – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]
కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]