దుబాయ్ విశేషాలు-5

-చెంగల్వల కామేశ్వరి

దుబాయ్ లో మరొక అహ్లాదకరమయిన ప్లేస్ దుబాయ్ క్రీక్.,
దుబాయ్ పుట్టిన ప్రాంతం అయిన దుబాయ్ క్రీక్, నగరాన్ని రెండు విభాగాలుగా చేస్తుంది. దేరా మరియు బర్ దుబాయ్‌గా విభజిస్తుంది. 
 
         దుబాయ్ క్రీక్ (వాటర్ కెనాల్ ) అక్టోబర్ 2/ 2013 న ఆవిష్కరించబడిన ఒక కృత్రిమ కాలువ మరియు 9 నవంబర్ 2016 న ప్రారంభించబడింది. కాలువకి ఇరువైపులా ఒక షాపింగ్ సెంటర్, నాలుగు హోటళ్ళు, 450 రెస్టారెంట్లు, లగ్జరీ హౌసింగ్, నడక మార్గాలు మరియు సైకిల్ మార్గాలు ఉన్నాయి. వెడల్పు 80 మీటర్ల నుండి 120 మీటర్ల వరకు ఉంటుంది. ఇది ఆరు మీటర్ల లోతు మరియు ఎనిమిది మీటర్ల ఎత్తైన వంతెనలను దాటాలి.
 
         దుబాయ్ కెనాల్ లో దిగువన రాత్రివేళ క్రూయిజ్ లగ్జరీ బోట్ ,లేక ఎయిర్ బస్ లో కెనాల్ కి అటు ఇటూ విస్తరించిన నగర సౌందర్యాన్ని తిలకిస్తూ చేసే విహారం మనలను ఉల్లాసపరుస్తుంది. దుబాయ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ కెనాల్ కి పైన అద్భుతమయిన ఫ్లోటింగ్ (తేలియాడే వంతెన) ఉంది. ఇది షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దృష్టి మరియు దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (ఆర్టిఎ) యొక్క నైపుణ్యం. వెరసి ఈ వంతెన నిర్మాణం అని చెప్పుకోవచ్చు.
 
         ఈ కెనాల్ లో విహరించడానికి లగ్జరీ రెస్టారెంట్లతో కూడిన క్యూయిజ్ లు, ఎయిర్ బస్ లు వంటి రకరకాల ప్యాకేజిలు ఉంటాయి. రాత్రివేళ చిక్కని చీకటిలో కృత్రిమంగా నిర్మించిన రంగు రంగుల జలపాతాలు విద్యుత్ కాంతుల శోభలు తిలకిస్తూ చేసే ఈ కెనాల్ విహారం మన మదిలో చెరగని ముద్ర వేస్తుంది. 
 
         ఇంక ఇక్కడ ఉన్న సముద్రం వాటినానుకుని ఉన్మ బీచ్ లు వాటి సమీపాన, సముద్రం నడుమన సంపన్నుల కొరకు కట్టిన హొటల్స్ ఎన్నో ఉన్నాయి. వాటిల్లో నాకు తెల్సిన కొన్ని వివరాలు ఇక్కడ అప్రస్తుతమయినా కాని ఒక విషయం చెప్పాలి. ఇక్కడి ఆర్కిటెక్చర్ విధానం చూస్తుంటే విభ్రమతో మతిపోతుంది. రకరకాల నమూనాలు, వాటికి వాడే కలర్స్ చెక్కు చెదరని విభిన్నమయిన రంగులు. ఎక్కువగా, బ్రౌన్ ఎమరాల్డ్ గ్రీన్ , గోల్డెన్ , గ్రే కలర్స్ లో ఉన్న ఎన్నో షేడ్స్ తో ఉంటాయి.
 
దుబాయ్ లో బుర్జ్ అల్ అరబ్ హొటల్
7 నక్షత్రాల హోటల్ మరియు ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటళ్ళలో ఒకటి. కృత్రిమంగా నిర్మించిన జుమీరా తీరప్రాంతంలో ఉన్న ఒక ద్వీపంలో బుర్జ్ అల్ అరబ్‌ను దుబాయ్‌లో సందర్శించవచ్చు. ఇది బోట్ ఆకారంలో బహుళ అంతస్తులతో నిర్మించారు.
 
హొటల్ అట్లాంటిస్
ఇది అట్లాంటిస్ కోల్పోయిన రాజ్యం యొక్క నేపథ్యం ఆధారంగా అరేబియా అంశాల థీమ్‌తో నిర్మించబడింది. ఈ హోటల్‌లో డాల్ఫిన్ బే, అడ్వెంచర్ వాటర్ పార్క్ మరియు గతకాలపు ఛాంబర్స్ ఉన్నాయి. దుబాయ్‌లో సందర్శకులను ఆకర్షించే ప్రదేశాలలో ఈ అద్భుతమైన నిర్మాణం ఒకటి.
 
ప్యామ్ జుమేరా
రెండు కిలోమీటర్ల పొడవుగా పామ్ జ్యుమిరా ఉంటుంది. సముద్రంలో. సరిగ్గా మన భాషలో చెప్పాలంటే (ఈతచెట్టు ఆకారంలో) లగ్జరీ విల్లాస్ మరియు అపార్టుమెంట్లు అంతర్జాతీయ ప్రముఖుల స్వంతం. హోటళ్ళు, రిసార్ట్‌లు మరియు నివాసాలతో పెద్ద సంఖ్యలో ఉన్న పామ్ జ్యూమిరా.. దుబాయ్‌లో సందర్శించే ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.
 
కైట్ బీచ్
దుబాయ్ యొక్క ప్రధాన గమ్యస్థానంగా ఈ అందమైన బీచ్ ఉంది. కైట్ సర్ఫింగ్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ కైట్ సర్ఫింగ్, ప్యాడిల్ బోర్డింగ్ వంటివి చేయవచ్చు.
 
మేడ్ ఇన్ మెరీనా
సముద్ర తీరం వెంట నిర్మించిన కృత్రిమ కాలువ నగరం దుబాయ్ మెరీనా. మెరీనా తీరాన నడక కోసం ఒక పాదచారుల మార్గం ఉంది. అద్భుతమైన రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు వినోద ఎంపికలతో ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది. 
 
         ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి అద్భుతాలన్నీ చూడాలన్నా ఆ ఆనందాలన్నీ అనుభవించాలన్నా ఖర్చు పెట్టుకోగల తిరిగే ఓపిక ఆస్వాదించే అభిరుచి ఉండాలి. 
ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ఓపిక అభిరుచి ఉంటే చాలదు. అక్కడి కరెన్సీ, ఖర్చు పెట్టుకోగల స్తోమతు, అయినా ఉండాలి. లేకపోతే వారి కనులను మన కనులుగాచూపించే మన పిల్లలు అయినా ఉండాలి.
 
ఇంకొన్ని దుబాయ్ అందాలు ప్రత్యేకతలు తరువాత చెప్పుకుందాము.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.