అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యముగారు సాంఘిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక మరియు ఆధ్యాత్మిక రచనలు, వ్యాసాలు, కవితలు, కథలు, నవలలు రచించారు. వీరి రచనలు తెలుగువెలుగు, జాగృతి,ఆంధ్రభూమి, శ్రీవెంకటేశం, ప్రజాడైరీ, నెలవంక-నెమలీక, సాహితీకిరణం,హిందూధర్మం, సహరి, సినీవాలీ, మన తెలుగు కథలు.కామ్, దేశభక్తిసాహిత్య 'ఈ' పత్రిక, తెలుగుసొగసు, తెలుగుఇజమ్ మరియు అంతర్జాల పత్రికలులో ప్రచురించబడ్డాయి. 'కలహంస' అని - నెలవంక- నెమలీక.
'సాహిత్య విక్రమార్క' అని - దేశభక్తి సాహిత్య 'ఈ' పత్రికల నుండి ప్రశింసించబడ్డారు. ఇంటర్మీడియట్ వరకూ మెదక్ లో, ఉన్నత విధ్య హైదరాబాద్ లోను అభ్యసించారు. ప్రైవేట్ సర్వీసులో 36ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.
ఇగో—( అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రాత్రి జరిగింది మరిచిపోతే బెటర్……ఇదిగో కాఫీ; ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి.’ అంటూనే న్యూస్యపేపర్లో దూరిపోయింది శారద. తను అప్పటికే రెడీ అయి వుందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్‌గా వుండడంతో నాకు గిల్టీగా అనిపించింది.అనవసరమైన రాద్దాంతం కదూ; మనసులో అనుకుంటూనే అద్దంలో నా మఖాన్ని నేను చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి. […]
ప్రక్షాళనము -పునీతము (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము వికాస్ నన్ను రమ్మంటే వారం సెలవు పెట్టి ముంబాయికి వచ్చాను ఫ్లైట్‌లో. వికాస్ వుంటున్న ఫ్లాట్ చాలా హై సొసైటీలో కంఫర్టబుల్‌గా, అధునాతన ఫర్నీచర్తోవుంటుంది. ఇక్కడికి వస్తే ఎడారిదాటి ఒయాసిస్సుకి చేరుకున్నట్టు సుఖంగా హాయిగా వుంటుంది. మామూలు మనుషులు, మామూలు ప్రపంచం మాయమైపోతారు. మాయాలోకం, ఒక అందాల దీవిలో ఆనందంలో తేలుతున్న అనుభూతి మనసుని మత్తుగా ఆవరిస్తుంది.” ముఝె మస్త్ మవోల్మే […]
దక్షిణ దేశ యాత్ర (భాగం – 1) (నవగ్రహ క్షేత్రాలు + పంచభూతలింగ క్షేత్రాలు + పంచ సుబ్రహ్మణ్య క్షేత్రాలు + రామేశ్వరము + కన్యాకుమారీ + మధుర మొదలగునవి) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సాయికృష్ణా ట్రావెల్స్ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి పదినాడు ఉదయము 6.45Am కు ఎగ్మోర్ కు చేరుకున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపాహార ములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చిచేరుకునే సరికి దాదాపు ఒంటిగంట అయినది. అచట […]
తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం. -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సుజల గారు రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్ అవార్డ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, జాగృతి, మరియు వివిధ వెబ్ మ్యాగజైన్లు వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి నవల “అమ్మ బంగారు కల” కు మూడు పురస్కారాలు లభించాయి. తానా వారు కూడా వీరి రచనలను చిన్న పిల్లల విభాగంలో ప్రచురించారు. […]
సాహసయాత్ర- నేపాల్ -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము అద్భుతమైన, సాహసవంతమైన నేపాల్ యాత్రా విశేషాలు. ఆద్యంతము ఆహ్లాదకరమైన ప్రకృతి, గగుర్పాటు కలిగించే ప్రయాణాలు, మనసోల్లాసము కలిగించే చక్కటి హిమబిందువులతో కూడిన పిల్లగాలులు. అన్నీ కలిసి మనలను ఎక్కడకో మరో లోకానికో, సుందర సుదూర తీరాలకు గొంపోవుచున్న అనుభూతులు.” ఇదిగో నవలోకం వెలసే మనకోసం”యన్నట్లు సాగింది. మార్చి 23 న హైద్రాబాద్ లో బయలుదేరి ఫ్లైట్ లో బెంగళూరు చేరుకున్నాము. అరగంట తరవాత బెంగుళూరు నుండి మరొక ఫ్లైట్ లో గోరఖ్‌పూర్ […]