ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

తెలుగు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గాగారు తెలుగు సాహితీలోకానికి పరిచయం అక్కరలేని పేరు. వీరు గుంటూరు జిల్లా యడ్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ గార్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసి, తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు.

ఓల్గా గారి కథలు, నవలలు, కవితలు స్త్రీవాదసాహిత్యంలో ఎన్నదగిన ముద్రవేశాయి. రచయిత్రిగానే కాక చిత్రాలు నిర్మించి చలన చిత్ర రంగంలో కూడా పురస్కారాలు పొందారు. వీరు రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.

అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా గారు రాసిన కథల ఆంగ్లానువాదాల్ని తమ సంగ్రహంలో చేర్చారు.

రచనలు:
రాజకీయ కథలు -1993
స్వేచ్ఛ – 1994
సహజ – 1995
ప్రయోగం – 1995
మానవి – 1998
కన్నీటి కెరటాల వెన్నెల – 1999
గులాబీలు – 2000
అకాశంలో సగం 
పలికించకు మౌనమృదంగాలు
అలజడి మాజీవితం
జీవితం
కన్నీటి కెరటాల వెన్నెల
అక్షర యుద్ధాలు – 2009
అతడు-ఆమె మనం – 2005
నవలామాలతీయం – 2006
సరిహద్దులు లేని సంధ్యలు (వసంత కన్నాభిరన్, కల్పన కన్నాభిరన్‌లతో కలిసి) – 1995

అనువాదాలు:
1. ఆగ్నెస్ స్మెడ్లీ కథలు (1984)

2. ఆలెక్షన్ద్ర కొల్లంటాయి మూడు తరాలు (Three Generations1989)

3. ఓరిఅన ఫాలసి పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం (Letter to a Child Never Born 1990)

4. ఎరియల్ దర్ఫ్మాన్ విడోస్ (Widows 1994)

ఎడిటెడ్ రచనలు
1. మాకు గోడలు లేవు (స్త్రీవాద వ్యాసాలు) (1989) 

2. నీలిమేఘాలు (స్త్రీవాద  కవితా సంకలనం) (1993) 

3. నూరేళ్ళ చలం (1994) 

4. సహిత (సాహిత్య వ్యాసాలు) (2010) 

కో ఎడిటెడ్ రచనలు
1. సారాంశం (1994) – ఆంధ్రప్రదేశ్లో స్త్రీల సారా వ్యతిరేక ఉద్యమంపై రిపోర్టు

2. సరిహద్దులు లేని సంధ్యలు (1995) – స్త్రీవాద రాజకీయాలపై వ్యాసాలు

అవార్డులు
1987 – ఉషోదయ పబ్లికేషన్స్ వారి ఉత్తమ నవలా రచయిత అవార్డు “స్వేచ్ఛ ” నవలకు.
1990 – ఉదయం మాగజైన్ వారి ఉత్తమ నవలా రచయిత అవార్డు
1998 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి  నంది అవార్డు (“తోడు’ కథకు ఉత్తమ కథా రచయితగా ) 
1999 – తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ స్త్రీ రచయిత అవార్డు
2014 – లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.
2015 – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (విముక్త కథల సంపుటి) 

*****

(ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
Please follow and like us:

2 thoughts on “ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. ఓల్గ గారి జన్మస్థలం చుండ్రు మండలం యడ్లపల్లి కాదు,చిలకలూరిపేట సమీపంలోని యడ్లపాడు

Leave a Reply

Your email address will not be published.