అనుసృజన

మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనువాదం: ఆర్.శాంతసుందరి

11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీ
యే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హై
వో బంసీ హో గయీ చోరీ
(రాధా , నా బంగారూ!  నా మురళిని ఇచ్చెయ్యవా?
నా ప్రాణాలన్నీ ఈ మురళిలోనే ఉన్నాయి
దాన్నే ఎవరో దొంగిలించారు)
కాహే సే గాఊం కాహే సే బజాఊం
కాహే సే లాఊం గైయా ఘేరీ
(ఇక నేను దేన్ని వాయిస్తూ పాడను?
అసలు దేన్ని వాయించను?
మురళి లేనిదే గోవుల్ని కూడగట్టుకుని ఎలా తోలుకు రాను?)
హా హా కరత్ తేరే పైయా పరత్
తరస్ ఖావో మోరీ రాధా ప్యారీ
( చాలా బాధపడుతున్నాను.  నీ కాళ్ళు పట్టుకుంటాను.
నా మీద కాస్త జాలి చూపించు రాధా నా బంగారూ!)
మీరా కే ప్రభు గిరిధర్ నాగర్
బంసీ లేకర్ ఛోడీ బంసీ లేకర్ ఛోడీ
(మీరా ప్రభువు గిరిధర్ నాగర్
చివరికి మురళి తీసుకుని కాని వదిలిపెట్టలేదు)
***
12. సఖీ రీ లాజ్ బైరన్ భయీ
శ్రీలాల్ గోపాల్ కే సంగ్ కాహే నాహీం గయీ
( సఖీ, నా సంకోచమే నాకు శత్రువైంది
ఆ గోపాలుడి వెంట ఎందుకు వెళ్ళలేదు నేను?)
చలన్ చాహత్ గోకుల్ హీ తే రథ్ సజాయో నయీ
రథ్ చఢాయే గోపాల్ లై గయో హాథ్ మీంజత్ రహీ
( గోకులం నుంచే బైలుదేరాలని కొత్త రథం కూడా సిద్ధం చేసుకున్నాం
కానీ గోపాలుణ్ణి మాత్రమే ఎక్కించుకుని రథం వెళ్ళిపోయింది
నేను చేతులు నులుపుకుంటూ ఉండిపోయాను)
కఠిన్ ఛాతీ స్యామ్ బిఛురత్ బిరహ్ మే తన్ తయీ
దాసీ మీరా లాల్ గిరిధర్ బిఖర్ క్యో నా గయీ
( ఆ శ్యామసుందరుడు దూరం కావటం మనసుకి ఎంత కష్టంగా ఉందో!
విరహంలో తనువు వేగిపోతోంది
ఆ గిరిధరుడి దాసీ ఓ మీరా ! నువ్వింకా ఛిన్నాభిన్నమైపోలేదా ?)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.