అమృత వాహిని అమ్మే కదా (పాట)

-డా||కె.గీత

ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా
అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా

ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా
జో లాలై కలలే పంచిన కనుచూపే కదా
కడలిని మించే కెరటము ఎగసినా
కడుపున దాచును అమ్మే కదా-

ఉరుము మెరుపుల ఆకసమెదురైనా
అదరదు బెదరదు అమ్మే కదా
తన తనువే తరువై కాచే
చల్లని దీవెన అమ్మే కదా

జీవితమే ఒక ఆగని పోరాటం
ఆశనిరాశల తరగని ఆరాటం
కుంగిన వేళల తలచిన చాలును
దారిని చూపును అమ్మే కదా

*****

11 thoughts on “అమృత వాహిని అమ్మే కదా (పాట)”

  1. అమ్మ పైన ఎన్ని కవితలు చదివినా మనసు నిండదు. గీతగారు ఈ గేయంలో తన కోణంలో అమ్మను రాగయుక్తంగా అద్భుతంగా ఆవిష్కరించారు. గీతగారికి అభినందనలు??

  2. డా కె. గీతా గారు మీరు రాసిన ‘అమృత వాహిని అమ్మే కదా ‘ పాట సింపుల్ గా హాయిగా మనసుకు హత్తుకునేలా ఉంది మీకు అభినందనలు ?

  3. అమ్మే కదా అమ్మే కదా అంటూ ఆద్యంతా మనసులని మీటుతూ ఎంతో హృద్యంగా ఆలపించిన ఉప్పెనలా ఉపద్రవం వచ్చిన తనువునే తరువుగా కాచిన ఆశనిరాశ ల
    నడుమ ఏమి ఆశించిన నిస్వార్థపు మహనీయురాలు అమ్మ
    ఎంత చెప్పిన తక్కువే ఏమిచ్చిన ఋణం తీర్చుకోలేము ఆ అమ్మ ప్రాదాలకి ప్రణామాలు గీతగారికి హృదయ పూర్వక అభినందనలు⚘️⚘️⚘️⚘️⚘️???

  4. డా. కె. గీత గారు వ్రాసిన అమృత వాహిని రచన కలం గళం అద్భుతంగా ఉంది సో…. హార్ట్ టచింగ్ మేడమ్ గారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ?????????????????

  5. డా.కె. గీత గారి ‘అమృతవాహిని అమ్మే కదా’ అన్న గేయం చదివాను. మాతృమూర్తి తన బిడ్డలను ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెంచుతుంది. అందుకే ముందు తల్లికి, తరువాత తండ్రికి, తరువాత ఆచార్యునికి, ఆపైన పరమాత్మకు నమస్కరించుకోవాలి. ఈ గేయంలో తల్లిప్రేమను తనదైన శైలిలో డా.కె.గీతగారు చక్కగా వివరించారు. గేయం బాగున్నది.

    1. మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు రంగారావు గారూ!

Leave a Reply

Your email address will not be published.