“నెచ్చెలి”మాట 

ఆశావహమైన 2023

-డా|| కె.గీత 

కొత్త
సంవత్సరం
2023 లోకి
మనందరం
విజయవంతంగా
అడుగుపెట్టాం-

2023
ప్రపంచంలో

యుద్ధాల్ని
రూపుమాపుతుందని

నష్టాల్ని
తొలగిస్తుందని

ద్రవ్యోల్బణాల్ని
తుడిచి వేస్తుందని

ప్రకృతిని
శాంతింప
జేస్తుందని

ఆశావహంగా
ముందుకు అడుగువేద్దాం


యుద్ధాలు
నష్టాలు
కష్టాలు
బాధలు

ఏదేమైనా
ఏ గాయమైనా
మానాలంటే
కాలం
ఒక్కటే
సహాయకారి!

కావాల్సిందల్లా
కాస్తంత
ఓర్పు!
కాస్త
సంయమనం!!

పెద్ద
పేద్ద
తీర్మానాల
వరకు
ఎందుకు
గానీ

కొత్త
సంవత్సరంలో
పాత బాధల్ని
తవ్వుకోవడం
తవ్వడం
కొంత
మానేసి
కొంతైనా
సంతోషాన్ని
పంచడమే
మనం
ఎవరికైనా
చెయ్యగలిగిన
సహాయం!

పాఠకులందరికీ
రచయిత(త్రు)లందరికీ
సహకరిస్తున్న అందరికీ
నెచ్చెలి
నూతన
సంవత్సర
శుభాకాంక్షలు!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

డిసెంబరు 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ఎల్.సుజాత

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ప్రేమపాశం కథ- రచయిత్రి హేమావతి బొబ్బు

ఇరువురికీ అభినందనలు!

*****

Leave a Reply

Your email address will not be published.