స్వరాలాపన-1 

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం! 

***

సినిమా: తులాభారం 

గీత రచన: రాజశ్రీ 

సంగీతం: సత్యం

రాగం: చక్రవాకం

ఆరో: స రి1 గ3 మ1 ప ద2 ని2 స*

అవ: స* ని2 ద2 ప మ1 గ3 రి1 స 

పల్లవి: 

రాధకు నీవేరా ప్రాణం

పనిదప మాగారి రీసా 

ఈ రాధకు నీవేరా ప్రాణం

గమ పనిదప మాగారి రీసా 

రాధాహృదయం మాధవనిలయం (2)

సరిగా పమమా పనిదప గపమా 

ప్రేమకు దేవాలయం…

మాదద దానీద సా*నీద

ఈ రాధకు నీవేరా ప్రాణం (2)

గమ పనిదప మాగారి రీసా 

చరణం : 1

నీ ప్రియ వదనం వికసిత జలజం

దానిద పమమా మగరిస గగమా 

నీ దరహాసం జాబిలి కిరణం

మా దదదానిదా నీస*స* నిస*నిదా ॥నీ ప్రియ॥

నీ శుభచరణం… ఆ……….

దనిదని రి*రి*రి*రి* దా నీ రీ* సా*

నీ శుభచరణం 

నిస*స*స* నిస*స*ద 

ఈ రాధకు శరణం

పదనీదప మగరిస 

చరణం : 2

బృందావనికి అందము నీవే

రాసక్రీడకు సారథి నీవే 

యమునాతీరం…

యమునాతీరం రాగాల సారం

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి- 

https://youtu.be/xIkiyTn4gUc

Leave a Reply

Your email address will not be published.