నేనెరిగిన వాసా ప్రభావతి -గణేశ్వరరావు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలు, ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించారు. ఆమె మరణం దారుణంగా మమ్మల్ని బాధిస్తోంది.’80 వ దశకంలో ఢిల్లీ కందుకూరి మహాలక్ష్మి ఇంట్లో వారితో అయిన పరిచయం అయింది ఇటీవల దాకా కొనసాగుతూ వచ్చింది. మా ఢిల్లీ తెలుగు అకాడమీ వారిని ఉత్తమ సాహితీవేత్త అవార్డ్ నిచ్చి సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి […]
వీక్షణం- 87 -రూపారాణి బుస్సా వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు. ముందుగా బలివాడ కాంతారావుగారి కథ “అరచేయి” కథ గురించి చర్చ జరిగింది. అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి […]
దీపావళి మ్యూజింగ్స్ -పద్మా మీనాక్షి అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే… జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే.. వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో! ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా? ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా […]
పరస్థాన శయన పురాణము (గల్పిక) -జోగారావు నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను. ఆ రోజు శని వారం. అప్పుడు సాయంత్రము ఆరు గంటలు. వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది. శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ . “ బాగున్నాయి పేర్లు. “ అన్నాను. […]
వీక్షణం- 83 -రూపారాణి బుస్సా జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]