“నెచ్చెలి”మాట 

ఫలితాలు

-డా|| కె.గీత 

కొన్ని
ఫలితాలు
చేసిన పనుల మీద
ఆధారపడి ఉంటాయి

అసలు
కీడెంచి మేలెంచాలని
ముందుకే వెళ్ళం

ఏం?
అయినా
అంతా మంచే జరుగుతుందని
ఆశించొచ్చుగా –

కొన్ని
ఫలితాలు
ఏం చేసినా మారవు

సాకుకోసం
ఎదురుచూస్తున్నట్టు
తప్పించుకుంటాం

ఏం?
అయినా
చెయ్యాల్సింది తప్పదని
చేసుకుపోవచ్చుగా-

కొన్ని
ఫలితాలు
ముందే తెలిసి పోతాయి

అయినా
ఆకాశమే విరిగిపడినట్టు
బెంబేలెత్తిపోతాం

ఏం?
కాస్తో కూస్తో ఆశతో
ధైర్యంగా ఉండొచ్చుగా-

అయినా
ఏ ఫలితాల గురించి
మాట్లాడుకుంటున్నాం?
అవసరార్థపు ప్రేమలా?
గ్రూపు పరీక్షలా?
రాజకీయ చదరంగాలా?
అమెరికా ఎలక్షన్లా?

ఏ ఫలితాలైతే ఏవిటి?
ప్రేమ-
మంచి-
ఆశ-

గతంలోనో
వర్తామానంలోనో
కూలిపోయినా
భవిష్యత్తు
ఎప్పుడూ
ఉంటుందిగా!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

నవంబరు, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: డా||ఐ.ఏ.పి.యస్.మూర్తి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: రాగ సౌరభాలు (వాణి నల్లాన్ చక్రవర్తి)

ఇరువురికీ అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.