“నెచ్చెలి”మా

బుద్బుదం

-డా|| కె.గీత 

“బుద్బుదం”
అనగానేమి?

అయ్యో, ఇదీ తెలియదా?
అదేనండీ
జీవితం

బుద్బుదమనగా
నీటి బుడగ
అని అనుకొంటినే!

అయినను
జీవితానికీ
బుద్బుదానికీ
సంబంధమేమి చెప్మా!

సంబంధమూ
బాంధవ్యమూ
కాదు-

జీవితమే
ఒక
బుద్బుదం

ఎప్పుడు
మాయమవునో
దానికే
తెలియదు

మరదేవిటీ?
కలకాలం
ఉండునదే
జీవితం
అన్నట్టు

గర్వాధికారమున
విర్రవీగువారు-
ధనాంధకారమున
కన్నూ మిన్నూ
కానని వారు-
కళ్ళు నెత్తికెక్కిన వారు….
తలపొగరువారు….
మున్నగువారికిది
తెలియదా?

ఎప్పటికీ
ఈ భూమి పైన
సజీవముగా
ఉండునటుల
వర్తింతురే!

పోయిననూ
కలకాలము
జీవించి
ఉండునటుల
ఆలోచింతురే!

అసూయాపరులు
కుళ్ళుబోతువారు
ఎదుటి వారు
నాశనమును
మాత్రమే
కోరుకొనువారు…..
ఎందరో
మహానుభావులు
అందరికీ
బుద్బుదమన్నది ఏదో
తెలియదా?

ప్చ్…
అటులే తోచుచున్నది

లేనిచో
ఎల్లరు
ప్రేమని పంచుట
ప్రేమగా జీవించుట
ప్రేమే పరమావధిగా ఎంచుట
చేసెడివారు కదా!

జీవిత అర్థమూ
కాదు కాదు
బుద్బుదార్థమూ
పరమార్థమూ
తెలిసి ఉండిన యెడల
తెలిసికొనిన యెడల

పోయిననూ
కలకాలము
ఈ భువిపై
జనుల
నాలుకల యందు
జీవింతురే!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జూలై, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  ములుగు లక్ష్మీ మైథిలి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: వ్యాధితో పోరాటం – కనకదుర్గ

 ఇరువురికీ  అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.