వృథాగా వలస పోతాను

ఫ్రెంచ్ మూలం: అబ్దుల్లతీఫ్ లాబి

ఆంగ్లం: ఆండ్రె నఫీస్ – సాహెలీ

తెలుగు సేత: ఎలనాగ

నేను వృథాగా వలస పోతాను
ప్రతి నగరంలో అదే కాఫీ తాగుతూ,
ఉద్వేగం లేని సర్వర్ ముఖాన్ని చూసి
మార్పు లేని పరిస్థితిని మౌనంగా అంగీకరిస్తాను
పక్క టేబుళ్ల దగ్గరి నవ్వు
సాయంత్రపు సంగీతాన్ని చెడగొడుతుంది
ఒక స్త్రీ అంతిమంగా నిష్క్రమిస్తుంది
నా పరాయీకరణను పక్కా చేసుకుంటూ
వృథాగా వలస పోతాను నేను
ప్రతి ఆకాశంలో అదే నెలవంకను చూస్తాను,
నక్షత్రాల అదే మొండి నిశ్శబ్దాన్ని అనుభవిస్తాను
నిద్రలో భాషల మిశ్రమాన్ని మాట్లాడుతాను,
జంతువుల, పక్షుల అరుపుల్ని అరుస్తాను
ఏ గదిలో ఐతే మేల్కొంటానో
అదే నేను పుట్టిన గది
నేను వృథాగా వలస పోతాను
ప్రయాణపు ప్రతి మజిలీలో తెరుచుకునే
నా సూట్ కేసులోని అయస్కాంతపు ముక్కలా
పక్షుల రహస్యం కూడా నాకు బోధపడక
తప్పించుకుంటుంది

*****

Leave a Reply

Your email address will not be published.