“నెచ్చెలి”మాట 

ఫలితం

-డా|| కె.గీత 

ఫలితం
అనగానేమి?

ఫలించినది-

అయ్యో!
నిఘంటువుల్లో
ఏవుంటే
మనకెందుకండీ-

మరేవిటండీ?

మరో మాట చెబుదురూ!

అయితే

ప్రారబ్ధం-
కర్మ –
తలరాత –
చేజేతులా చేసుకున్నది –

వగైరా…
వగైరా?
మరీ అంత
నిష్టూరం
మాటలెందుగ్గాని

మరో మాట చెబుదురూ!

ఎన్నుకున్న వారికి
దొరికినది
మార్పు కోసం
ఎదురుచూసినవారికి
లభించినది

ఆ ఇప్పుడు వస్తున్నారు
దారికి –

ఫలితమనగా
రాజకీయంబున
పండినది
మరోదారిలేనిదీ

కొత్త చూపు
కొత్త దారీ
కొత్త ప్రభుత్వం…..

ఇక
చాల్లెండి-
ఏదైనా
జన సామాన్యానికి
సత్ఫలితం
అయితే చాలు !

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

నవంబర్ 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సునీత పొత్తూరి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఒకనాటి మాట(కథ) – కాళ్ళకూరి శైలజ
ఇరువురికీ అభినందనలు!

*****

Leave a Reply

Your email address will not be published.