చిత్రలిపి

పట్టాభిషేకం

-మన్నెం శారద

ఎగిరిపో  …ఎగిరిపో …

దిగంతాలకు….అనంతమై …

ఎగసిపో …ఎగసిపో ….

నేలతల్లి పిలుపులకి  దూరంగా …అతివేగంగా ….

నీసౌకుమార్యమైన రెక్కలపై యుగయుగాలుగా 

నిలిపివుంచిన బరువుని విదిలించి 

నీ హృదయం లో అనాదిగా పేరుకున్న 

భయ భ్రాంతులని  అదిలించి 

అందమైన బిరుదుల మాయాజాలం తో 

నిన్ను అలరించి 

తరతరాల, దాస్యంలో  ఇరికించి 

కానరాని సంకెల  బంధించి 

నిన్నుదాసీగా చేసిన 

ఈ సమాజపు కుట్రలనుండి 

విడివడి 

సాగిపో ….సాగిపో …

ఇకనైనా  నిన్ను నీవు తెలుసుకుని 

మహారాణిగా పట్టాభించుకో !

*****

Leave a Reply

Your email address will not be published.