తల్లిలా….తండ్రిలా…

-సాహితి

ఇంటి

గుండె చప్పుడు

హృదయాలకు జోలపాట

 

నాలుగు గోడలే

దిక్కులుగా

పై కప్పే ఆకాశంగా

ఇంటి కౌగిలిలో హాయిగా కమ్మని నిద్ర.

 

ఒద్దికగా అమరిన వస్తువులు

మౌనంగా మాట్లాడే నేస్తాలు.

కలల ప్రతిరూపాలుగా

ఇంటికి అలంకారాలు.

 

పై కి కనిపించే

గోడ, తలుపు, మెట్లు

మా బహిప్రాణాలు..

 

లోపల జీవించే

ఇటుకు, సిమెంట్, ఇసుక

మా అంతర్జీవాలు.

 

తల్లిలా

కడుపులో పెట్టుకునే వంటళ్లు

అక్షయపాత్ర.

 

తండ్రిలా

గుండెలో పెట్టుకుని ఇళ్లే

అభయప్రదాత.

 

ఇల్లే వెలుగు

వెలువే బంధం.

బంధమే జీవం.

ఒక వాకిలికి

ఎన్నో చేతులో… ఎన్నో కనులో

ఎంత ఓపికో..

 

పడకగా మారి నిద్రను

నిశబ్దాన్ని త్రాపి అలసటను

అందరిని పిలిచి తోడుగా

ప్రేమ నీడ పరచి

 

జీవితంలో తృప్తినిచ్చే

ఈ సుమధురమే

స్వర్గం

స్వర్ణం

సంబరం

సుందరం.

****

One thought on “తల్లిలా….తండ్రిలా… (కవిత)”

  1. బాగుంది. ఇంకొన్ని కవితలు రాయండి

Leave a Reply

Your email address will not be published.