అనుసృజన

మీనాకుమారి హిందీ కవిత-4

అనువాదం: ఆర్.శాంతసుందరి

అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.

4.

యూ( తేరీ రహగుజర్ సే దీవానా-వార్ గుజరేకాంధే పే అపనే రఖ కే అపనా మజార్ గుజరే నీ వీధిలోంచి పిచ్చిదానిలా నడిచానునా భుజం మీదే నా సమాధి మోస్తూ నడిచాను బైఠే రహే హై( రస్తే మే దిల్ కా ఖండహర్ సజాకర్శాయద్ ఇసీ తరఫ్ సే ఏక్ దిన్ బహార్ గుజరే శిథిలమైన మనసును అలంకరించుకుని ఈ దారిలో కూర్చున్నానుఏదో ఒకరోజు ఇటువైపు వసంతం రాకపోతుందా అనుకుంటూ! బహతీ హుయీ యే నదియా ఘులతే హుయే కినారేకోయీ తో పార్ ఉతరే కోయీ తో పార్ గుజరే ప్రవహిస్తున్న వాగూ, కరిగిపోతున్న తీరాలుఎవరైనా ఒడ్డున దిగరా? ఎవరైనా ఈ తీరం చేరుకోరా? తూనే భీ హమ్ కో దేఖా హమ్ నే భీ తుఝ్ కో దేఖాతూ దిల్ హీ హార్ గుజరా, హమ్ జాన్ హార్ గుజరే నువ్వూ నన్ను చూసావు, నేనూ నిన్ను చూసానునువ్వు మనసు పారేసుకుని వెళ్ళిపోయావు, నేను నా ప్రాణాలనే పారేసుకున్నాను!

*****

Leave a Reply

Your email address will not be published.