మూడు చిన్న కవితలు

ఆంగ్లమూలం: ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే

తెలుగు సేత: ఎలనాగ

అవిశ్రాంత వ్యక్తి

నా కొవ్వొత్తి రెండు వైపులా వెలుగుతుంది
రాత్రంతా వెలగడానికి అది సరిపోదు
కానీ నా శత్రువులారా! ఇంకా నా మిత్రులారా!
అది అద్భుతమైన వెలుగును ఇస్తుంది

గురువారం

బుధవారంనాడు నిన్ను నేను ప్రేమిస్తే
అది నీకేమిటి?
గురువారం నాడు నిన్ను నేను
ప్రేమించకపోవడం ఎంతో వాస్తవం
ఏమిటి నీ ఫిర్యాదు?
అర్థం కావడం లేదు నాకు
అవును, బుధవారం నాడు నిన్ను ప్రేమించాను
అయితే ఏంటి?

వేసవి కాలం

ఎందుకు వస్తావు నువ్వు, ఏప్రిల్?
సౌందర్యమే సరిపోదు
జిగురుతో విప్పుకునే చిరు ఆకుల ఎరుపుతో
నువ్వు నాకు స్థిమితాన్ని ఇవ్వలేవు
నా ఉద్దేశమేమిటో నాకు తెలుసు
అందమైన కుంకుమపువ్వుల్ని చూస్తుంటే
నా మెడ మీద ఎండ వేడిమి తగులుతోంది

*****

Leave a Reply

Your email address will not be published.