“నెచ్చెలి”మా

ప్రయాణం

-డా|| కె.గీత 

ఎచటి నించి
వీచెనో ….

ఆగండాగండి
చల్ల గాలి
పిల్ల గాలి
కాదు

మరేవిటటా?!

అదేనండీ-
జీవన
ప్రయాణం

అంత
తాత్వికత
మా వల్ల కాదు
కానీ
మరేదైనా
చెప్పండి

అదే
ఏదో
ఒక
ప్రయాణం
ఎచటి నించి
ఎచటికైనా
ఎచటి నించి
ఎచటికి
వీచినా

అదే ఏవిటట?

ప్రయాణం

ప్రయాణం
అంటే
భయం
పట్టుకుంది

నువ్వెక్కాల్సిన
విమానం
ఎక్కడో చోట
కూలుతుంది
అంతెందుకు
అసలు
బయలుదేరనే
బయలుదేరదు

ఫ్లైటు
ఏ కారణం
చేత
కాన్సిలు
అయినా
డబ్బు
గోవిందా-

అయినా
సరే-
చెప్పాల్సింది
చెప్పాల్సిందే
చిరిగిన చొక్కా
తొడుక్కునైనా
ఓ టిక్కెట్టు
కొనుక్కోవాల్సిందే

నిజానికి
ఎక్కడో చోట
ఆగాల్సిన
ప్రయాణమైనా

మళ్లీ
ఎక్కడో
మొదలవ్వాల్సిన
ప్రయాణమే
కదా!

ఏదేమైనా
మనతో
నీడలా
ప్రేమగా
వెంటాడే
జ్ఞాపకమే
కదా
ప్రయాణం!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

నవంబరు, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  సి. ఎస్. జి. కృష్ణమాచార్యులు  

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: “తుఫాన్” – పారుపల్లి అజయ్ కుమార్ కథ ఇరువురికీ  అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.