అనుసృజన

కవితలు చనిపోతూ ఉండటం

మూలం: సోనీ పాండే

అనువాదం: ఆర్. శాంత సుందరి

ఇప్పుడే వచ్చిందిఒక కవితకొన్ని పదాలు ఉప్పొంగాయికొన్ని భావ తరంగాలు ఎగసిపడ్డాయివేళ్ళు వణుకుతూ తహతహలాడసాగాయిఒక కలం దొరికితేకవిత పుడుతుంది కదా కాగితం మీద అనిఅణువణువూ విరుచుకుపడిందికవిత ఇక మొలకెత్తబోతూ ఉంది ఇంతలో ఒక కరకు గొంతు చెవులకి సోకిందిఉతకవలసిన బట్టలు అలాగే ఉన్నాయిమధ్యాహ్నం అయిపోయింది అన్న ధ్యాస ఉందా?మత్తెక్కిస్తుంది కవిత్వంరాయటం అనేది ఒక వ్యసనంగౌరవమైన కుటుంబ స్త్రీలు ఎక్కడైనా అలవరుచుకుంటారాఇలాంటి అసభ్యమైన అభిరుచులు…ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళకుందిఇలాంటి అభిరుచిఅంతే ఈ మాటలు వినిపించగానే-మూసుకున్నాను కళ్ళు, చెవులూఅయినా ఆ ఘాటైన విషం పడనే పడింది చెవుల్లోశవం దగ్గర శోకాలు పెట్టే ఆడవాళ్ళ లాంటిది కవిత…పుట్టకముందే మరణించింది కవిత…

*****

Leave a Reply

Your email address will not be published.