పెళ్ళయ్యాక ..!

– సిరికి స్వామినాయుడు

నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో దేవత ఇల మీదికొచ్చిందన్నపుడైనా ఊహించలేదుఇంటికి  నన్నో జీతం భత్యం లేని పని మనిషిని చేస్తావనీ ..! బతుకుబండికి మనిద్దరం  రెండెద్దులమన్నప్పుడైనా బోధపడలేదునన్నో గానుగెద్దుని చేసి గంతలు కడతావనీ .. ! చిన్నీ బుజ్జీ ..‌ యన్న  ప్రేమ పిలుపుపెళ్లయ్యాక .. ఒసే గిసేంటూ  బుసలెందుకు కొడుతోందీ ? ప్రకృతితో పోల్చీ పొగిడిన  ప్రతిసారీ పొంగిపోతున్న వెర్రిమాలోకమనుకున్నావే గానీ ..మాట వెనుక మార్మికతను పసిగట్టి మంటై ముంచెత్తదనుకున్నావు గదూ ..! పెళ్లికి ముందున్న సమానత్వం పెళ్లయ్యాక .. బానిసత్వమవుతుందంటే ..ఖచ్ఛితంగా నేనా పెళ్లినే ధిక్కరిస్తాను !!

*****

Leave a Reply

Your email address will not be published.