నిన్నర్థం చేసుకుంటున్నాను

-కోడం పవన్ కుమార్

ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను వంటగది తాలింపు వాసనలోనీ చెమట సౌందర్యం కానరాలేదుతలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటేనీవొక మాంసపు ముద్డగానే కనిపించావుఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్నలెక్కలేనన్ని నీ పాదముద్రల్లోశ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయానుఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునేమరయంత్రంగానే భావిస్తూమాటల కీ ద్వారా నా అవసరాలను సమకూర్చుకున్నానువిశ్రాంతి కోసమోనిద్ర కోసమోపడకమీద నడుం వాల్చితేనాలోని కోర్కెకు అక్కరకొచ్చేఅపూర్వమైన కానుకగానే భావించానుపురిటినొప్పులతో మెలికలు తిరుగుతుంటేమొలక పూసిన ఆనందభాష్పాలు నీ కంటినుంచి రాలుతుంటేస్త్రీగా నీ బాధ్యత తీరిందని కొట్టిపడేశానునీ ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండాగాల్లో గిరికీలు కొడుతున్న నన్నుఓ వేణునాదాన్ని చేద్దామన్న నీ కోరికను తిరస్కరించినజ్ఞాపకమిప్పటికీ నా కడుపులో దేవినట్లుగానేవుంది అరవైలో పడీపడగానే వ్యసనాలన్నీపేగుల్ని నరాల్నీ ఊపిరితిత్తుల్నీ కాలేయాన్నీ మూత్రపిండాల్నీకొరుక్కుతింటూ శరీరాన్ని గుల్లబరిచిందిమంచానికి అతుక్కుపోయిన నాకుఆసుప్రతి గదిగోడలనిండా నీవే కనిపిస్తున్నావుసెలైన్ బాటిల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న నీ ఆరాటంశరీరంలోకి ఇంకుతూ చైతన్యం ప్రవహిస్తోందిఅదుపులోకి వస్తున్న రక్తపోటునీ విశ్వాసం తెరలు తెరలుగా కదులుతోన్నదిసన్నగిల్లుతున్న నీ సహనం వెనుకనా జీవితం పదునుదేరుతున్నది ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇప్పటినుంచీ నిన్నర్థం చేసుకుంటూనేవుంటానునా కనురెప్పలు మూతపడేవరకూ….

*****

Leave a Reply

Your email address will not be published.