డైరీలో ఒక పేజీని…

-సుభాషిణి తోట

కొన్ని సమాధుల గురించి మాత్రమే మాట్లాడే మనంచావులు వాటికి కారాణాల గురించి ఏ ధారావాహికను  ప్రసారం చేయలేం చేసినా ప్రాణం మన నుండి వీడినాక మొదలెడతాం. ఒక బిడ్డ  బతుకు కోసం నీ కలం వేల కన్నీళ్ల ఆర్తనాదమై గర్జించాలి లేదంటే శవమో ఆ అంతర్భాగమో నదులై పారుతాయికుండపోతగా కురుస్తాయి కాలం కాని కాలంలోభూమి మీద పాపాలై మొలుస్తాయి కూడా….విషపూరితమైన గాలులు వీస్తాయిఅడవుల్లోకి దట్టమైన మంటలై పారుతాయి…ప్రతి చెట్టు కొమ్మా పామైమళ్ళీ మళ్ళీ నిన్ను విషపూరితం చేస్తుంది…. మొక్కలు బ్రతకవుగాలి పలకదునది సాగదునీరు పారదుఆకాశంలో ఒక్క పక్షీ తన రెక్కలతో ఎగిరేందుకు స్వేచ్చని తీసుకోదుప్రకృతి అంతా శూన్యంతో నిండిపోతుంది…. అందుకనినీ జీవిత డైరీలో ఒక్క పేజీనిఆ పసికందుల అన్యాయాన్ని ఎదిరిస్తూనోఏడుస్తూనోకనీసం కొవ్వొత్తి వెలుగులో నీ ప్రేమ తెలుపుతూ ఉండుకాదంతే కుదరదంటేసమాధుల గురించి తప్ప ఇంక దేనిగురించైనా మాట్లాడే అర్హత కోల్పోతావ్..

*****

Leave a Reply

Your email address will not be published.