ఆలస్యంగా

-మనోజ్ఞ ఆలమూరు 

మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం
ఎవరు కాదనగలరు?
అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను
ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా….

ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ…
తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను
ఎన్నెన్నో మధుర స్మృతులు
మరెన్నో చేదు జ్ఞాపకాలునూ..
అన్నింటినీ కలిపే తీపి కల….
వాస్తవంలోకి లాక్కొచ్చే జీవితం

కలలోని నీ రూపం కోసం నా ఎదురుచూపు
ఆ ఎదురుచూపులో మిగిలే నైరాశ్యం
అది ఎప్పటికీ కలే అని తెలిసినా
మళ్ళీ మళ్ళీ అదే కల కనే నా ఆశ

నీతో జీవితం కల కాకుంటే బాగుండు
కానీ ఎప్పటికీ నువ్వు నా కలల మనిషివే కదా
ఆశకు నిరాశకు మధ్యన ఆగిపోయాను
అయినా.. నాకేం కాదు
కలల తర్వాత మెలకువలో నిన్ను ఎప్పటికైనా కలుసుకుంటాను

*****

Leave a Reply

Your email address will not be published.