నిశీధి పరదాలు

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– మొహమ్మద్ అఫ్సర వలీషా

కునుకులమ్మను ఒడిసి పట్టికలల లోగిలిలో బంధించికనబడని తీరాలకు చేర్చికాసింత సాంత్వన పొందాలని ఉంది…  గాయపడి రక్తమోడుతూగాఢంగా అలుముకునిగది గది నింపుతున్న జ్ఞాపకాల తెరలనుగట్టిగా విదిలించుకునిగెలుపు తీరాలకు చేరాలని ఉంది…  మనసు పలికే మూగ భావాల మంచు తెరలు దింపుతూమస్తిష్కంలో ముసురుకునిమిన్నంటిన ఆలోచనా దారాల పోగులనుమౌనంగా చుట్ట బెడుతూ ఆత్మ విశ్వాసపు దుప్పటితోనిశీధి పరదాలను తొలగించాలని ఉంది…. ! !

*****

Leave a Reply

Your email address will not be published.