
చిత్రలిపి
కాలమహిమ!
-మన్నెం శారద
సాగరుని చేరేముందు సాగు భూమినిమరింత సస్యశ్యామలం చేయాలనిమహోన్నత ఆశయంతోఒండ్రుమట్టిని మోసుకొచ్చి ……….నన్ను నేను నిలువునా పాయలుగా చీల్చుకున్నాను ఇంత వాననీటికి వాగై వొచ్చిన ఓ పిల్ల సెలయేరువళ్ళూపై మరచి”ఓస్ఇంతేనా “నువ్వన్నట్లు వెకిలిగా నవ్వింది అహో …కాలమహిమ కదా ఇది !!!!
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
