అన్నీ తానై..

-చందలూరి నారాయణరావు

సూర్యుడు
నాకు గుర్తుకు రాడు.
నాలో ఉదయించే వెలుగు వేరు..

చంద్రుడు
నాకు అవసరం అనుకోను.
నాలో పూసిన ఓ శశి ఉంది

గాలితో
నాకు పనే లేదు
నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది.

మట్టిని
ప్రత్యేకంగా తాకేదు లేదు.
నాకై నడిచే ముద్రలో సంతోషాలే అన్నీ

వానలో
తడిసే పనే ఉండదు నాకు
జ్ఞాపకాల జల్లుకు కరువేలేదు.

నాకు నాతోనే పనిలేదు
నాలో ఉన్న నీవు
కొరత కావు.

*****

Leave a Reply

Your email address will not be published.