image_print

నా జీవన యానంలో (రెండవ భాగం) -18

నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి           అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు.  పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి!           కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -17

నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. లోన్ మోహన్ కే ఇస్తామన్నారు.  ఇంతదూరం వచ్చాం కదా ఒప్పుకోమని మోహన్ ని చాలా బ్రతిమలాడేను.  తను ససేమిరా అనేసరికి చేసేది లేక తిరిగి వచ్చేసాం. మధ్యాహ్నం భోజనాల దగ్గర మా తమ్ముడికి విషయం […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి  మంత్లీ లో […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -15

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి     ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ‘ప్రశాంతి’ కలువబాల పత్రిక నవలికల పోటీ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -14

నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు  వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు.  ఉదయం పది గంటలకు మద్రాసు లో దిగాం. మేం ఎక్కాల్సిన ట్రైన్ రాత్రి 7.20 కి.  స్టేషన్ దగ్గర్లో చిన్న లాడ్జి లో రూమ్స్ తీసుకున్నారు.  మా ముగ్గురికి ఒకటి, వాళ్ళ అందరికీ ఒకటి.  ఫ్రెష్ అయి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -13

నా జీవన యానంలో- రెండవభాగం- 13 -కె.వరలక్ష్మి 1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, ఇలా ముఖ్యమంత్రుల్ని దించెయ్యడం వల్ల ఆంధ్రాలో ఆమె ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అని భయంవేసేది. 1982 లోనే అని గుర్తు. రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువదించిన ఓల్గా కథ మూడు తరాలు ఆంధ్రజ్యోతి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -12

నా జీవన యానంలో- రెండవభాగం- 12   -కె.వరలక్ష్మి 1978వ సంవత్సరంలో హైదరాబాద్ లో దూరదర్శన్ టి.వి. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయ్యేవట. 1981 నుంచీ రాష్ట్రం మొత్తం రావడం ప్రారంభమైంది. మొదట్లో ధనవంతులు కొద్ది మంది మాత్రమే టీ.వీ. కొనుక్కోగలిగేవాళ్లు. బ్లేక్ అండ్ వైట్ లోనే ప్రసారాలు వచ్చేవి. పల్లెల్లో జనానికి మొదట రేడియోనే వింత. ఎక్కడో కూర్చుని మాట్లాడుతూంటే ఇక్కడికి విన్పిస్తున్నాయి మాటలు అని కథలు కథలుగా […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-17 ‘అశాంతికి ఆహ్వానం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 28 ‘అశాంతికి ఆహ్వానం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1981లో ఒకరోజు పేపరు చూస్తూంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇస్తారనే ప్రకటన ఒకటి కనపడింది. అప్పటికే నా స్నేహితుల్లో, బంధువర్గంలో అందరికీ పెద్దలు ఇచ్చిందో, సొంతంగా కట్టుకున్నదో ఇళ్ళున్నాయి. నాకూ ఒక ఇల్లుంటే బావుండునని అనిపించింది. అప్పటికి ఏడేళ్ళ క్రితం ఐదువేలతో శ్రీరామ్ నగర్ లో కొన్న స్థలం అప్పు తీరలేదు. ఊళ్ళో ఉన్న రెండు బేంకులూ నెలనెలా కొంత చొప్పున […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-16 సంధ్యా సమస్యలు కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 27 ‘సంధ్యా సమస్యలు ‘  కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా ఫ్రెండ్స్ ఇద్దరిళ్ళలో విడివిడిగా జరిగిన సంఘటనలివి. 1992లో ‘రచన’ కోసం కథ రాయాల్సివచ్చినప్పుడు ఈ రెండు డిఫరెంట్ సంఘటనల్నీ ఒకే చోట కూర్చి రాస్తే ఎలా ఉంటుంది అనిపించి రాసిన చిన్న కథానిక ఇది. అప్పటికి మా పిల్లలింక హైస్కూల్లో చదువుకుంటున్నారు. కాని, నాకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఈ కథ చదివిన చాలామంది ఇది మా ఇంట్లో జరిగిన కథ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-15 ‘గేప్’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 26  ‘ గేప్ ‘ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ఈ చిన్న కథ సికింద్రాబాద్ నుంచి రైలు సామర్లకోట చేరేలోపల రాసినది. 1994లో నిజాం నవాబ్ కు చెందిన భవంతులు పురానా హవేలీ, ఫలక్ నుమా పేలలాంటివి జనం చూడడానికి ఒక నెలరోజులు ఓపెన్ గా ఉంచారు. ఆ వార్త పేపర్లో చూసి నేను, నా జీవిత సహచరుడు దసరా సెలవుల్లో హైదరాబాద్ లో ఉన్న మా తమ్ముడింటికి వెళ్ళాం. ఉదయాన్నే బస్సో, […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు (చివరి భాగం)

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం)  -వెనిగళ్ళ కోమల అమెరికాలో స్నేహితులు మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి రోజంతా గడుపుతాము. కృష్ణ కుమార్ గారు సౌమ్యులు. నెమ్మదిగా అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చిస్తుంటారు. ఇక జ్యోతిర్మయి రకరకాల వంటలు ఓపిగ్గా మాకు చేసి పెడుతుంటారు. ఎప్పుడూ వారింట్లో ఎవరో ఒకరు స్నేహితులు బస […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-14 ‘పుట్టిల్లు’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 22  ‘పుట్టిల్లు’ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ‘పుట్టిల్లు ‘ – కథానేపధ్యం ఈ కథను పంపించడం, ప్రచురణ ‘వనిత’లో 1987లో జరిగినా, రాసి అప్పటికి చాలాకాలమైంది. మొదట్లో రాసిన చాలా కథల్ని పత్రికలకెలా పంపాలో తెలీక కొన్ని, తెలిసిన తర్వాత పోస్టేజికి డబ్బులు లేక కొన్ని, ‘ఇది మంచికథేనా? ‘ అన్న సంశయంతో కొన్నిఫెయిర్ చెయ్యకుండా వదిలేసాను. (అలా వదిలేసి తర్వాత పత్రికల్లో వచ్చిన కొన్ని కథల్ని ఈ మధ్య ‘పిట్టగూళ్ళు’ పేరుతో […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-12

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-12 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి ఏకైక పుత్రిక శాంతిశ్రీ చిన్నప్పటి నుండి నవీన, రాజుతో మంచి స్నేహితురాలుగా మెలుగుతూ వచ్చింది. ఇప్పడు పూనా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి వక్త. […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-13 ‘జీవరాగం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 21 ‘జీవరాగం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి హైస్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి స్కూల్ ఫైల్ (11thyస్) వరకు నా క్లాస్ మేట్ మూర్తి. మాకు దూరపు బంధువులు కూడా. వాళ్ళ తల్లిగారు నాకు పిన్ని వరసౌతుంది. తర్వాత కాలంలో మూర్తి ఎం.ఏ చేసి పోలీసు ఆఫీసరయ్యాడు. ఉద్యోగరీత్యా ఎక్కడో దూరంలో ఉండేవాడు. 1990లో హఠాత్తుగా అతని నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ఈ కథలోని ఉత్తరం యధాతధంగా అతను రాసిందే […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల రాజు ఢిల్లీ నివాసం యూరప్ లో ఉన్నప్పుడే “హిందూస్థాన్ టైమ్స్” ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు చేయాలనే తలంపుతో ఉన్నాడు. తాను పుట్టినదేశం, తనకు చదువు సంధ్యలిచ్చిన దేశం పట్ల తనకు కర్తవ్యం ఉన్నదనే భావంతోనే హిందూస్థాన్ టైమ్స్ వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. రాజు తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, “ది వాల్ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-12 “శతాయుష్మాన్ భవ ” కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 20 ‘శతాయుష్మాన్ భవ’ – కథానేపథ్యం -కె.వరలక్ష్మి 1960లనాటికి ఇంగ్లీషు, హిందీ హైస్కూల్లో ఆరవ తరగతిలో ప్రారంభమయ్యేది. మాకు అలా ఇంగ్లీషు నేర్పిన వారు శ్రీ జోగారావు మాష్టారు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది పట్టి పట్టి నేర్పించేవారు. ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్పేవారు. నేను సెలవుల్లో మా అమ్మమ్మగారింటికి వెళ్ళి తిరిగి వచ్చాక రెండు వారాలు ఆలస్యంగా హైస్కూల్లో జాయినయ్యాను అప్పటికే నా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-11 “పెద్దమామయ్య” కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 20 పెద్ద మామయ్య – కథానేపథ్యం -కె.వరలక్ష్మి విపుల మాసపత్రిక కథల పోటీలో కొద్దిలో మొదటి బహుమతి తప్పిపోయిన ‘పెద్దమామయ్య • నాకిష్టమైన నా కథల్లో ఒకటి నిజానికి ఆ మామయ్య నా సొంత మామయ్య కాదు పోల్నాడులోని రైతుకుటుంబానికి చెందిన ఆయన, మా వెనక వీధిలో వున్న మోతుబరి రైతుకి ఇల్లరికపుటల్లుడిగా వచ్చాడు. సాత్త్వికుడు, అందమైనవాడు. పొలమారు ఖద్దరు పంచె, పొడవు చేతుల కళ్ళలాఫారం, భుజం మీద మడత విప్పని […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-10

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-10 -వెనిగళ్ళ కోమల కాలేజ్ సర్వీస్ అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. తన పుట్టిన రోజున మాకు పార్టీలిచ్చేవాడు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. రాఘవేంద్ర మాన్వీ, క్రిస్టీనా, జాఫ్రీ – అందరం ఒక కుటుంబ సభ్యులుగా అమెరికాలో పెరిగేవాళ్ళం. నేను క్రిస్టీనా ఖమరున్నీసా బేగం (ఎకనామిక్స్) స్నేహంగా, […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-9

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-9 -వెనిగళ్ళ కోమల నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చి ఉన్నాడు. ఇన్నయ్యకు ఆ పెండ్లికి అభ్యంతరం లేకపోయింది. జనవరి 12, 1988న రిజిస్టర్ వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ క్లబ్ లో డిన్నర్ ఇచ్చాము. వ్యవధి లేకపోవటాన నా వాళ్ళంతా ఊళ్ళ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-10 దగా కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 దగా  – కథానేపధ్యం -కె.వరలక్ష్మి   1988లో మేం శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి గృహప్రవేశం చేసాం. అప్పటికి ఈ కాలనీలో అక్కడొకటి ఇక్కడొకటి వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని ఇళ్ళుండేవి. మా ఇంటి ఎదుట ఒక చిన్న తాటాకిల్లు వుండేది. రోడ్లు చిన్నవి కావడం వలన ఆ ఇంటి వాళ్ళు వాకిట్లో మంచాలేసుకుని పడుకుంటే మా వాకిట్లో పడుకున్నట్టే వుండేది. ఆ ఇంటికి ఆనుకుని దక్షిణంవైపు 500 చదరపు […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-8

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా ఉన్న ఓరియంట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. పదార్ధాలు ఆర్డరిచ్చి మాట్లాడుకుంటున్నాము. నాలో అతిసన్నని కదలిక అనిపించింది. గర్భం సూచన అది అనిపించింది. భోజనం సహించలేదు. ఓరియంట్ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉండేది. ఎలీట్, […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-9 ‘సర్పపరిష్వంగం’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 సర్పపరిష్వంగం – కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో చాలా కాపు కుటుంబాల్లో ఆయుర్వేద గుళికలు తయారుచేస్తూ వుండేవారు. అలా అమ్మడానికి వెళ్ళేవాళ్ళు ఆరేసినెలలు, ఇంకా పైన తిరిగి వచ్చేవారు. మధ్యలో అప్పుడప్పుడు ఓ కార్డురాసి క్షేమం తెలిపి పదో పరకో పంపిస్తూ వుండేవారు. […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-8 స్వస్తి కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో చూసినదానికి నేనెలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ కొందరు, అనుకూలంగా కొందరు పేపర్లలో రాస్తున్నారు. రాజకీయ పార్టీలు చూద్దామా అంటే ఒక పార్టీ ‘అలా మసీదును కూలగొట్టడం తప్పు’ అంటే వెంటనే […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-7

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-7 ఏ గూటి సిలక – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త ఇంజనీరు కావడంతో ఆమె జీవితం ఆర్థికంగా బావుండేది. మిగతా నలుగురివీ అంతంతమాత్రపు ఆర్థిక స్థితులు. దాంతో ఆవిడ చాలా అతిశయంతో డామినేటింగ్ పెర్సన్ గా వుండేది. కాని, ఆమెకు పిల్లలు కలగలేదు. అప్పటికి మెడికల్ […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-6

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు బక్కగా ఉండేదాన్ని. తనకు తెలుగు రాదు గనుక ఇద్దరం హిందీలో కబుర్లాడుకుంటూ నడిచాం. ఆ అబ్బాయిలు తెలుగులో మా మీద కామెంట్స్ పాస్ చేస్తూనే నడిచారు. మాకు అర్థం కాదని గాబోలు – ‘ఈమె […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-5

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-5 -వెనిగళ్ళ కోమల నాకు 8 ఏళ్లుంటాయి  నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది అన్నాడు. నాన్న అతని మాటలు నమ్మాడని కాదుగాని అతను నాన్నను ప్లీజ్ చేయటానికి వాడిన సమయస్ఫూర్తి నచ్చి అతనికి 2 రూపాయలు (అప్పుడది ఎక్కువ) యిచ్చి పంపాడు. దానధర్మాలు చేయటం, చందాలు విరివిగా ఇవ్వటం […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-6 మల్లెపువ్వు – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 17 మల్లెపువ్వు – కథానేపధ్యం -కె.వరలక్ష్మి మా పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ, పెళ్ళి తర్వాతా నేనెదుర్కున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. అంతకు రెండేళ్ళ ముందే ఎల్.ఐ.సి లోన్ పెట్టి ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు పూర్తయ్యేవరకూ పెళ్ళిళ్ళ మాట తలపెట్టవద్దులే అనుకోవడం వల్ల నా సంపాదనలో ఇంటి ఖర్చులు పోను మిగిలినది లోకి వడ్డీ కట్టేస్తూ వచ్చేదాన్ని, నా సంపాదన అని ఎందుకంటున్నానంటే మా పిల్లల తండ్రిది నాకన్నా ఎక్కువ […]

Continue Reading

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-4

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. చిక్కు తీసుకోలేక పీకి, కత్తిరించి పడేస్తుంటే అన్నయ్య – నీకెందుకింత చక్కని జుట్టు వచ్చిందో గాని నులకతాడు పేనినట్లు పేనుతున్నావు అని కోప్పడేవాడు. మంచి దువ్వెన తెచ్చి ఇచ్చాడు.  ఇంటర్ లో 10 మంది […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-5 ఆశాజీవులు కథ గురించి

నా జీవన యానంలో- రెండవభాగం- 16 ఆశాజీవులు కథ గురించి -కె.వరలక్ష్మి 1972లో నేను స్కూలు ప్రారంభించాను, నాలుగేళ్ళ మా అబ్బాయితో కలిపి ఏడుగురు పిల్లల్లో ప్రారంభించినప్పటి నా ధ్యేయం నా ముగ్గురు పిల్లలకీ లోటులేకుండా తిండి, బట్ట సమకూర్చుకోవాలనే, కాని, నాలుగైదు నెలలు గడిచేసరికి మంచి ప్రాధమిక విద్యను అన్ని వర్గాల పిల్లలకీ అందుబాటులోకి తేవడం ముఖ్యమని అర్ధమైంది. అందుకే ప్రారంభంలో మొదలుపెట్టిన పది రూపాయల ఫీజును పాతికేళ్ళైనా మార్చలేదు. కూలి జనాల పిల్లలకి పుస్తకాలు, […]

Continue Reading
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-4 సువాసినీ పూజ

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి అది 1991 ఏప్రిల్ నెల. మా అత్తగారి మూడో చెల్లెలు సరోజని. నలుగురు పిల్లల తల్లి. అప్పటికి రెండేళ్ళుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి మరణించింది. నలభై రెండేళ్ళ వయసు. కుటుంబంలో అందరికీ బాధాకరమైన సంఘటన. గోదావరి జిల్లాల్లో పునిస్త్రీగా మరణించిన వాళ్ళ పేరున పదకొండో రోజున దగ్గర్లో ఉన్న చెరువు వొడ్డునో, కాలువ వొడ్డునో మూసివాయనం పూజలు జరిపి ముత్తైదువులందరికీ చేటలో పసుపు, కుంకుమ, చిన్న అద్దం […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-3 గాజుపళ్లెం కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 14 గాజుపళ్లెం (కథ) -కె.వరలక్ష్మి నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన ఈ కథ తర్వాత చాలా సంకలనాల్లో చోటు చేసుకుంది. బోలెడన్ని ఉత్తరాలొచ్చేలా చేసి చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. 2013లో వచ్చిన ‘నవ్య నీరాజనం’ లోనూ, 2014లో వచ్చిన ‘కథ-  నేపథ్యం’ లోనూ ఈ కథనే […]

Continue Reading
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-2

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-2 -వెనిగళ్ళ కోమల పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-2 ‘పిండిబొమ్మలు’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 13 ‘పిండిబొమ్మలు’ కథ గురించి -కె.వరలక్ష్మి  నేను స్కూల్ ఫైనల్ చదివేటప్పుడు మా ఊరు జగ్గంపేటలో పబ్లిక్ పరీక్షలకి సెంటర్ లేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళవాళ్ళు అప్పటి తాలూకా కేంద్రమైన పెద్దాపురం వెళ్ళి పరీక్షలు రాయాల్సి వచ్చేది. పెద్దాపురం మా ఊరికి పదిమైళ్ళు. ప్రైవేటు బస్సులు జనం నిండితేనే కదిలేవి, టైంతో పనిలేదు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, మాకూ కూడా రోజూ అలా ప్రయాణం చెయ్యడం అప్పట్లో చాలా పెద్ద విషయం, క్లాసులో […]

Continue Reading
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-1

జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి! అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-1 (“పాప” కథ)

నా జీవన యానంలో- రెండవభాగం- 12 “పాప” కథా నేపథ్యం -కె.వరలక్ష్మి  నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి మళ్ళీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట. మా ఇంటి ఎదుట మాలపల్లెలోని జల్లి వీరన్న మనవడు అతను. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా అమ్మానాన్నల్ని అమ్మ – నాన్న అని, నన్ను చెల్లెమ్మ అని పిలిచేవాడు. నేను బళ్ళో నేర్చుకున్న చదువు ఇంటికొచ్చి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -11

నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి  అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక మంచి రేడియో కొనుక్కోవాల్సిందే అనుకున్నాను. అలాంటి కొత్త వస్తువులేం కొనుక్కోవాలన్నా అప్పట్లో అటు కాకినాడగాని, ఇటు రాజమండ్రిగాని వెళ్లాల్సిందే. ఒక్క పుస్తకాలు తప్ప మరేవీ సొంతంగా కొనే అలవాటు లేదప్పటికి. మోహన్ తో చెప్పేను, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 10

నా జీవన యానంలో- రెండవభాగం- 10 -కె.వరలక్ష్మి  స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల ఎకరాలమేర విస్తరించి ఉన్న అందమైన, ప్రశాంతమైన ఆశ్రమం అది. మా ఆడపడుచురాణిని ఆపక్క ఊరైన వెంకటనగరం అబ్బాయికి చెయ్యడం వల్ల వాళ్ల పెళ్లికి వెళ్లినప్పుడు ఆ ఆశ్రమాన్నీ, పక్కనే ఉన్న ధారకొండనీ చూసేను. ఆ […]

Continue Reading

నా జీవన యానంలో- రెండవభాగం- 9

నా జీవన యానంలో- రెండవభాగం- 9 -కె.వరలక్ష్మి  మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని విచారించాడు. ‘‘రమణ జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడ్డాడమ్మా, మేమంతా హాయిగా ఆడుకొనేవేళల్లో తను సైకిల్ రిపేర్ షాపుల్లో పనిచేసేవాడు. ఊళ్లో కాలినడకన, పొరుగూళ్లకి ఎంతదూరమైనా సైకిల్ మీదా తిరిగేవాడు’’ అంటూ మానాన్న బాల్యం […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 8

నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి  గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా ఓ బీరువాలో సర్ది, ప్రత్యేకంగా ఓ రిజిస్టరు పెట్టేరు. నా చిన్నప్పటితో పోల్చుకుంటే పాఠకులు బాగా పెరిగేరు. ముఖ్యంగా ఆడవాళ్లు, కొత్త పుస్తకాలకి రోజుకి అర్ధరూపాయి రెంట్ అని గుర్తు. అప్పుడప్పుడే యండమూరి, మల్లాదిల […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 7

నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి  కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని. ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని, ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు కాదు. ఊళ్లో ఒకటో రెండో బట్టల కోట్లు ఉండేవి. రెడీమేడ్ షాపులనేవి లేవు. ఊళ్లోకి మూటల వాళ్ళు తెచ్చిన మంచి రంగులూ, డిజైన్స్ ఉన్న కట్ పీసెస్ కొని పిల్లలకి బట్టలు కుట్టించేదాన్ని. మసీదు […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి  అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను, మగ పిల్లలకి తీసుకొను’ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు. 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం, పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు. నేను […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు. నాకేమో మోహన్ కూడా పి.జి. చేసి హెడ్ మాస్టరో, లెక్చరరో అయితే బావుండునని ఉండేది. బుక్స్ కొనేస్తే తనే […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా” అని అడిగేడు. నేనా విషయం మోహన్ తో చెప్పి ‘చేరదామా’ అని అడిగేను . “శాంత, రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి. నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు” అన్నాడు. లయన్స్ […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం. రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్. పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు. పక్కనే రోడ్డు కవతల సంత. పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే […]

Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో […]

Continue Reading