చిత్రలిపి

ఇప్పుడయితేనేమి….

-మన్నెం శారద

భూమి గుండ్రమో..లేక పలకలోరేపు మరో శాస్త్రకారుడుద్భవించి....ఇంకెలానో ఉందన్న వింతలేదు నేను మాత్రం బయలు దేరిన చోటికే వచ్చి చేరాను వయసురాని మనసుకి ఒకటే ఆశ! నీలాల నింగి వంగి ఆకుపచ్చని నేలని స్పృశించిన చోటుని ఆర్తిగా తాకాలని…ఆకాశపూలని తెంచి నా సంచినింపుకోవాలనితారలని నా గుమ్మానికి తోరణంగా కట్టినీలాన్ని వలువగా చేసి నా మేనికి చుట్టుకోవాలని…. తిరిగి తిరిగి అలసిసొలసివున్నచోటకే తిరిగి వచ్చి చేరాను ఇప్పుడయితేనేమి ….అవును ఇప్పుడయితేనేమి??? నా సంచిలో మిగిలేవున్నాయి… నిన్నటి కొన్ని జ్ఞాపకాలురేపోమాపో వికసించబోయే కొన్నితియ్యని రేపటి కలలు!!!

*****

Leave a Reply

Your email address will not be published.