చిత్రం-78

-గణేశ్వరరావు 

స్వీయ చిత్రాలు: బాపు

‘స్వీయ చరిత్రలు’ ఉన్నప్పుడు ‘స్వీయ చిత్రాలు’ కూడా ఉంటాయిగా! సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఆటో బయోగ్రఫీ రాయడానికి ఇష్ట పడలేదు, కారణం ఆయన జీవితంలో లోకోత్తర సంఘటనలు జరగలేదట, పైగా జరిగినవన్నీ రాయాల్సిన వి కావు, ‘dark corners’ ని వెలుగులోకి తీసుకు వస్తే ఒక చిక్కు, తీసుకుని రాకపోతే ‘ఆత్మ ద్రోహం అని వారు అనుకున్నారు. ‘! ‘స్వీయ చిత్రం’ తో మరో చిక్కు ఉంది, నలకూబరుడు తన బొమ్మ వేసుకుంటే బాగుంటుంది, కానీ యముడు ఐతే… అందుకే అనుకుంటా ‘బాపు’ తన బొమ్మని గీస్తూ caricature (వ్యంగ్య చిత్రం) చేసారు. , సరే, ఈ కోవలోని బొమ్మలు చూద్దామా?

మొదటిది వేసింది : బాపు, Rockwell స్ఫూర్తి తో వేసినది .

 

రెండోది: బాపు కి స్ఫూర్తి కలిగించిన చిత్రకారుడు గీసిన బొమ్మ: Norman Rockwell

మూడోది: ఈ రకం చిత్రాలకి ఆద్యుడు అనదగిన జోహాన్నెస్( Johannes Gumpp )ది. ఈయనది 17 వ శతాబ్దం.

ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వున్నాయి. ఇదొక రకమైన త్రిఫలం: ఇక్కడ కళాకారుడు తనను తాను మూడు సార్లు చిత్రీకరిస్తాడు. మొదటిది తన ముఖాన్ని చూపించకుండా వీక్షకుడికి తన వెనుక భాగంతో, రెండవది అతను చూస్తున్న అద్దంలో అతని ప్రతిబింబం ద్వారా, మూడవది అతను తనను తాను చిత్రీకరిస్తున్న చిత్రంలో.
ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

*****

Leave a Reply

Your email address will not be published.