ప్రత్తిపాటి నానీలు

-సుభాషిణి ప్రత్తిపాటి

నా ఉనికి

నిశ్శబ్దం!

కానీ నా రాతలు మాత్రం

ఓ శబ్దస్పర్శే!!

వేలభావాలు

తోడుతున్నాను!

చిత్రంగా

గుండెబావి ఊరుతూనే ఉంది!!

కలం

విప్లవానికి తొలి గళం!

సంఘం గుట్టు

విప్పుతుంది కదా!

కాలం

కరిగిపోతోంది!!

ఆయువు కూడా

తరిగిపోతోంది!!

చందమామ

మెరిసిపోతున్నాడు!!

మకిలిలేని.కొత్తగాలి

కమ్ముతోందిగా!!

అంతులేని విశ్రాంతిలో

ఆయనకు నడక!

అలసటతో..

ఆమె పడక!

*****

4 thoughts on “ప్రత్తిపాటి నానీలు (కవిత)”

  1. నానీలు బావున్నాయి సుభాషిణి గారు. మీ కలం మనసులోని వేల భావాలకు సదా కొత్త నిర్వచనం వెతుకుతునే ఉంటుంది

  2. బావున్నాయి సుభాషిణి గారు..మీ కలం మనసులోని భావాలకు సదా కొత్త నిర్వచనం వెతుకుతునే ఉంటుంది

Leave a Reply

Your email address will not be published.